Share News

‘మురసు’ నష్టం 343.95 కోట్లు

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:52 AM

అర్నబ్‌, మురసు తుఫాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ర్టాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.... కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు.

‘మురసు’ నష్టం 343.95 కోట్లు

  • ఉదారంగా సాయం చేయండి

  • అమిత్‌ షాకు సీఎం లేఖ..

  • రెండు సార్లు ఫోన్‌లో సంభాషణ

అర్నబ్‌, మురసు తుఫాన్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ర్టాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు.... కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరారు. తుఫాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంభవించిన పంట, ఆస్తి నష్టంతో పాటు ప్రజలకు కలిగిన ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరిస్తూ అమిత్‌ షాకు ముఖ్యమంత్రి లేఖ రాశారు. రాష్ర్టానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని తక్షణమే అందించాలని విజ్ఞప్తి చేశారు. ఒకే రోజు రెండుసార్లు అమిత్‌ షాతో ఫోన్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి, వరుస తుఫాన్ల కారణంగా రాష్ర్టానికి ఎదురైన నష్టాన్ని వివరించారు. ప్రాథమికంగా సుమారు రూ.343.95 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. ఇందులో దాదాపు 94 శాతం నష్టం వ్యవసాయ రంగంలోనే ఉందని తెలిపారు. తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందాన్ని పంపినందుకు అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 04:52 AM