Share News

సెమీ కండక్టర్‌, ఏఐ రంగాలకు ఊపు

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:22 AM

రాష్ట్రంలో సెమీ కండక్టర్‌, ఏఐ రంగాలకు ఊపునిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని సెమికండక్టర్‌ డిజైన్‌ ప్రాజెక్టులకు సహకరించేందుకు ముందుకొచ్చింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వయంగా చంద్రబాబును కలిసి దీనిపై చర్చలు జరిపారు.

సెమీ కండక్టర్‌, ఏఐ రంగాలకు ఊపు

  • సాయం అందించేందుకు కేంద్రం సమ్మతి

  • 10 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్‌

  • ఢిల్లీలో సీఎంతో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ భేటీ

  • అమరావతి-విశాఖ హైస్పీడ్‌ కారిడార్‌కు సీఎం వినతి

  • నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుపై అమిత్‌షాతో చంద్రబాబు మర్యాదపూర్వక భేటీ

న్యూఢిల్లీ, అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సెమీ కండక్టర్‌, ఏఐ రంగాలకు ఊపునిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని సెమికండక్టర్‌ డిజైన్‌ ప్రాజెక్టులకు సహకరించేందుకు ముందుకొచ్చింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్వయంగా చంద్రబాబును కలిసి దీనిపై చర్చలు జరిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు, రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల అంశంపై అశ్వినీ వైష్ణవ్‌తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి గురించి సీఎంకు కేంద్ర మంత్రి వివరించారు. ఏపీలో ప్రతిపాదించిన సెమీ కండక్టర్‌ ప్రాజెక్టుతోపాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. తొమ్మిది పోర్టులకు అవసరమైన కనెక్టివిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ఆమోదం తెలియచేశారు.

విజయవాడ బైపాస్‌ నిర్మాణానికి రూ.3,197 కోట్లు, కొవ్వూరు-భద్రాచలం రైల్వే ప్రాజెక్టుకు రూ.2,860కోట్లు, ఒంగోలు- దొనకొండ రైల్వే ప్రాజెక్టుకు రూ.1,800 కోట్లు, అనకాపల్లి-కొత్తవలస బైపాస్‌ ప్రాజెక్టుకు రూ.2,190 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సీఎం వివరించారు. విజయవాడ బైపాస్‌లో భాగంగా కృష్ణా నదిపై రెండు కొత్త వంతెనలను నిర్మించాలని కోరారు. విజయవాడ-ఇటార్సీ, ఖరగ్‌పూర్‌-విజయవాడ రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పెంచే దిశగా నాలుగు లైన్ల నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని సూచించారు. అమరావతి-విశాఖట్నం మధ్య హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు స్లీపర్‌ వందే భారత్‌ రైలును నడపాలని సీఎం కోరారు. దీనికి కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారు. విశాఖపట్నం- తిరుపతి మధ్య పగటిపూట సీటింగ్‌ సౌకర్యంతో మరో రైలును ప్రవేశపెట్టేందుకు కూడా సమ్మతించారు. కొత్తగా నిర్మించిన కనిగిరి-విజయవాడ మార్గంలో ప్రయాణికుల రైలు సేవలను ప్రారంభించాలని సీఎం కోరారు.


న్యాయమూర్తి కుమారుడి పెళ్లి విందుకు హాజరు

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ కుమారుడి వివాహం సందర్భంగా మోతీలాల్‌ నెహ్రూ మార్గ్‌లో జరిగిన విందుకు చంద్రబాబు హాజరైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 04:22 AM