Share News

పీ-4 మోడలే సుస్థిరాభివృద్థికి మూలం

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:52 AM

‘నాంది’ ఫౌండేషన్‌ 28 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంపై స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

 పీ-4 మోడలే సుస్థిరాభివృద్థికి మూలం

  • ఆనంద్‌ మహీంద్ర పోస్టుపై సీఎం చంద్రబాబు

అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘నాంది’ ఫౌండేషన్‌ 28 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంపై స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. 28 ఏళ్ల క్రితం తాము ప్రారంభించిన సేవా ప్రయాణం వెనుక ఉన్న అసలైన ఉద్దేశాన్ని ఈ పోస్టు మరోసారి గుర్తు చేసిందని చంద్రబాబు ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ‘దివంగత డాక్టర్‌ కె.అంజిరెడ్డితో కలిసి 28 ఏళ్ల క్రితం నాంది ఫౌండేషన్‌ను ప్రారంభించాం. పీ-4 మోడలే సుస్థిరాభివృద్థికి మూలం’ అని చంద్రబాబు వివరించారు. డాక్టర్‌ అంజిరెడ్డి ఆశయాలను ఆనంద్‌ మహీంద్ర, మనోజ్‌కుమార్‌తోపాటు ఫౌండేషన్‌ బృందం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తుండటం తనకు ఎంతో గర్వ కారణంగా ఉందన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 06:55 AM