ప్రజలు మనవైపే!
ABN , Publish Date - Nov 11 , 2026 | 01:32 AM
కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని, స్థానిక ఎన్నికల్లో అది చాలా స్పష్టంగా ప్రతిఫలించిందని ముఖ్యమంత్రి అన్నారు.
‘స్థానిక’ ఫలితాల్లో ప్రతిఫలించింది: సీఎం
కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారని, స్థానిక ఎన్నికల్లో అది చాలా స్పష్టంగా ప్రతిఫలించిందని ముఖ్యమంత్రి అన్నారు. స్థానిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓడిపోవడానికి మన నిర్ణయాల్లో లోపాలే కారణం తప్ప.. ప్రజల నుంచి ఎలాంటి లోపమూ లేదని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ సహకారంతో కూటమి అద్భుత పనితీరు కనబరచిందన్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో గెలుపును తలకెక్కించుకోవద్దని, మనపై ఉన్న బాధ్యత మరింత పెరిగిందని భావించి ప్రజాసేవలో నిమ గ్నం కావాలని మంత్రులకు సూచించారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత సహకార ఎన్నికలకు వెళ్దామని.. వీటిని జనవరిలో నిర్వహిస్తామని తెలిపారు.
బాబు, పవన్‌కు మంత్రుల అభినందనలు..
స్థానిక ఎన్నికల్లో కూటమి ఘన విజయంపై క్యాబినెట్ భేటీ ప్రారంభంలో మంత్రులందరూ లేచి నిల్చొని చప్పట్లతో చంద్రబాబును అభినందించారు. ఈ విజయానికి మీరే కారణమని ఆయన్ను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశంసించారు. మంత్రులు కూడా పరస్పరం కరచాలనం చేసుకుని అభినందనలు తెలియజేసుకున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు
30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!