Share News

నియోజకవర్గాల పునర్విభజనపై అమిత్‌ షాతో చంద్రబాబు చర్చలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:08 AM

పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను ఎప్పుడు ప్రవేశపెట్టాలన్న విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. శనివారం సాయంత్రం అమిత్‌ షాతో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

నియోజకవర్గాల పునర్విభజనపై అమిత్‌ షాతో చంద్రబాబు చర్చలు

ఏపీ అభివృద్ధికి సాయంపై కృతజ్ఞతలు

న్యూఢిల్లీ, అమరావతి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను ఎప్పుడు ప్రవేశపెట్టాలన్న విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. శనివారం సాయంత్రం అమిత్‌ షాతో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు దేశ రాజకీయ పరిస్థితుల గురించి చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లు, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై వస్తున్న ఆరోపణలు, మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్రంలో స్థానిక ఎన్నికల గురించి కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి ప్రాజెక్టులు అమలవుతున్నాయని చెప్పిన చంద్రబాబు, కేంద్రం అందిస్తున్న కీలక సహకారానికి అమిత్‌ షాకు కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 05:08 AM