నల్లమడ వాగును పరిశీలించిన సీఎంనల్లమడ వాగును పరిశీలించిన సీఎం
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:22 AM
మురసు ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా జిల్లెళ్ళమూడి వద్ద ఉన్న నల్లమడ వాగు బ్రిడ్జిని శుక్రవారం పరిశీలించారు.
వరద బాధిత రైతులతో నష్టంపై ఆరా
బాపట్ల, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): మురసు ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా జిల్లెళ్ళమూడి వద్ద ఉన్న నల్లమడ వాగు బ్రిడ్జిని శుక్రవారం పరిశీలించారు. షెడ్యూల్ టైంకు దాదాపు గంటన్నర ఆలస్యంగా మధ్యాహ్నం 1:40కి ఆయన బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జిల్లెళ్ళమూడి వద్ద నల్లమడ వాగు వద్దకు బయల్దేరారు. మధ్యలో ఆదర్శనగర్ వద్ద ఉన్న పేరలి డ్రైయిన్‌ను పరిశీలించారు.
బాధిత రైతులతో మాట్లాడారు. నష్టం గురించి ఆరా తీశారు. జమ్ములపాలెంతో పాటు ఉప్పరపాలెం గ్రామస్థులు తమ సమస్యలను నివేదించారు. వాటి పరిష్కారానికి హామీ ఇస్తూ సీఎం ముందుకు కదిలారు. ‘నల్లమడ డ్రెయిన్ సామర్థ్యం 22 వేల క్యూసెక్కులు కాగా.. మురసు తుఫాను, భారీవర్షాలకు 55 వేల క్యూసెక్కులు వచ్చింది. వాగు సమీపంలోని అన్ని గ్రామాల్లోని పొలాలనూ వరద ముంచెత్తి అధిక నష్టం జరిగింది. ఈ డ్రెయిన్ ముంపునకు శాశ్వత పరిష్కారానికి ఆలోచన చేస్తాం’ అని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
సీఎం విజయ్‌కు ఫోన్ చేసి అదే చెప్పా: సీఎం చంద్రబాబు