Share News

మా సుపరిపాలనకు మెచ్చి ఇచ్చిన తీర్పు

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:51 AM

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు మెచ్చి ప్రజలిచ్చిన తీర్పునకు నిదర్శనమని సీఎం చంద్రబాబు అన్నారు.

మా సుపరిపాలనకు మెచ్చి ఇచ్చిన తీర్పు

  • ‘గుడ్‌ పాలిటిక్స్‌.. గుడ్‌ గవర్నెన్స్‌’ మా విధానం: చంద్రబాబు

  • ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

  • రాజకీయ పార్టీ లక్షణాలు వైసీపీకి ఉన్నాయా?

  • వారసత్వంగా వచ్చిన సమస్యలింకా ఉన్నాయ్‌: సీఎం

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు మెచ్చి ప్రజలిచ్చిన తీర్పునకు నిదర్శనమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘గుడ్‌ పాలిటిక్స్‌.. గుడ్‌ గవర్నెన్స్‌’ తమ విధానమన్నారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కార్యాలయంలో అధికారులతో కలసి మీడియాతో మాట్లాడారు. ‘రాజకీయ మా.. ప్రజా సమస్యల పరిష్కారమా అంటే.. నేను ప్ర జా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యమిచ్చాను. అనునిత్యం వారి ఆకాంక్షలు తీర్చేందుకు పనిచేస్తున్నాం. దీనిని చూసే ప్రజలు కార్పొరేషన్‌, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటేశారు’ అని తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజలు ఇదేవిధంగా సహకరించాలని కోరారు. సేవలందించే విషయంలో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటున్నామన్నారు. వైసీపీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఉన్నా యా అని ప్రశ్నించారు.

36 వేల కోట్లతో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు

36 ప్రాధాన్య ప్రాజెక్టులను రూ.36 వేల కోట్లతో నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు వచ్చే మార్చి నాటికే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ‘ఎప్పుడో 30 ఏళ్ల కిందట నేను శంకుస్థాపన చేసిన వెలిగొండ ప్రాజెక్టును నేనే ప్రారంభించాను. అమరావతి పనులు పరుగులు పెట్టిస్తున్నాం. గతంలో రోడ్లను ధ్వంసం చేశారు. మేం వాటిని వేశాం. అయితే అన్ని పనులూ చేసేశామని చెప్పడం లేదు. వారసత్వంగా వచ్చిన సమస్యలు ఇంకా ఉన్నాయి’ అని తెలిపారు.


తుఫాన్లపై అపహాస్యం..

ఎన్నికలన్నాక రాజకీయ పార్టీలు ఉంటాయి.. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేవారు ఉంటారు.. అధికార పార్టీకి ఓటేయని వారు ఉం టారు.. కులాలు, మతాలు కూడా ఉంటాయని సీఎం వ్యాఖ్యానించారు. చివరకు తుఫానులపైనా ఎగతాళి చేసేవారు సైతం ఉంటారని అన్నారు. తుఫాన్లకు సంబంధించి గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని.. విద్యాసంస్థలకు సెలవులు ఇస్తే.. కాకినాడలో ఓ నాయకుడు ‘ఇంకా రాదేమిరా తుఫాను’ అని అపహాస్యం చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని చంద్రబాబు ఆక్షేపించారు.

ఇలా పోస్టు చేసిన 3 గంటల్లోనే వర్షబీభత్సం కనిపించిందని.. తర్వాత ఆ నాయకుడు తలదించుకున్నాడన్నారు. తుఫాను ప్రభావం పై ఊహాజనితమూ ఉంటుందని.. దానిని సరిదిద్దుకుంటున్నామని సీఎం వెల్లడించారు. ‘ఐదు రోజులుగా తుఫానులపై నిరంతరం సమీక్ష జరుపుతూనే ఉన్నా. గత రాత్రి ఒంటి గంట వరకూ సమీక్షించా.. మళ్లీ ఇవాళ తెల్లవారుజామున సమీక్షించా.. ముఖ్యమంత్రిగా ఇది అవసరమా అని అనుకోవచ్చు.. ప్రజా సమస్యల కోసమే ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా’ అని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 01:51 AM