Share News

23 స్థానిక సంస్థల్లోనూ విజయం సాధించాలి

ABN , Publish Date - Nov 15 , 2026 | 01:22 AM

పట్టణ, పరిషత్‌ ఎన్నికల్లో కూటమికే ప్రజలు చారిత్రక విజయాన్ని ఇచ్చారని, మరో 23 పట్టణ స్థానికసంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు తిరుగులేని విజయాన్ని సాధించాలని...

23 స్థానిక సంస్థల్లోనూ విజయం సాధించాలి

  • గ్రామాల్లోనూ కూటమి అభ్యర్థులే గెలవాలి

  • పంతాలకు పోవద్దు.. కలిసి పనిచేయండి

  • టీడీపీ ముఖ్యనేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): పట్టణ, పరిషత్‌ ఎన్నికల్లో కూటమికే ప్రజలు చారిత్రక విజయాన్ని ఇచ్చారని, మరో 23 పట్టణ స్థానికసంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు తిరుగులేని విజయాన్ని సాధించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు దివానిర్దేశం చేశారు. శనివారం పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాల్లోనూ కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలన్నారు. స్థానిక ఎన్నికల్లో యువతకు, చదువుకున్న వారికి అవకాశం కల్పించామన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో చెడ్డపేరు తెచ్చుకోవద్దని, గొడవలకు పోవద్దని సూచించారు. గ్రామస్థాయి ఎన్నికలను నేతలు తేలిగ్గా తీసుకోవద్దన్నారు. గ్రామస్థాయిలోనూ కూటమి బలపరిచే అభ్యర్థుల్లో మంచి వారిని ఎంపిక చేద్దామని సూచించారు. గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలు యాక్టివ్‌గా ఉండి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఉద్యోగులంతా కూటమి ప్రభుత్వం వైపు నిలబడ్డారని, వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మలేదన్నారు. సుమారు 7 జిల్లాల్లో క్లీన్‌ స్వీప్‌ చేశామన్నారు. అనకాపల్లి, మార్కాపురం జిల్లాల ప్రజలు నూరుశాతం స్ట్రైక్‌రేట్‌ ఇచ్చారన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 01:25 AM