Share News

చంద్రబాబు దిగ్భ్రాంతి

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:06 AM

అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్‌ హైస్కూలు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదిలో రంపంతో అత్యంత అమానుషంగా దాడి చేయడంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి

అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్‌ హైస్కూలు ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదిలో రంపంతో అత్యంత అమానుషంగా దాడి చేయడంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తీవ్రగాయాలపాలైన విద్యార్థిని పరిస్థితిని, అందుతున్న చికిత్స గురించి అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం విద్యార్థిని తల్లితో చంద్రబాబు ఫోనులో మాట్లాడి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని, నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. విద్యార్థిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని హామీ ఇచ్చారు. బాలికలిద్దరికీ మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 03:06 AM