Share News

ఏం తల్లీ..! బాగున్నారా..?

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:42 AM

పేదల సేవలో ‘2.0’ కార్యక్రమంలో భాగంగా రేపల్లె వచ్చిన సీఎం చంద్రబాబు... ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎక్కువగా లబ్ధి పొందినవారి గురించి కలెక్టర్‌ వాసుదేవ వినోద్‌కుమార్‌ను ఆరా తీశారు.

ఏం తల్లీ..! బాగున్నారా..?

  • పథకాలు అందుతున్నాయా?

  • కిరాణా దుకాణం నిర్వాహకురాలితో సీఎం సంభాషణ

  • డ్వాక్రా రుణంతో షాపు ఏర్పాటు చేయడంపై అభినందనలు

కొల్లూరు, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): పేదల సేవలో ‘2.0’ కార్యక్రమంలో భాగంగా రేపల్లె వచ్చిన సీఎం చంద్రబాబు... ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎక్కువగా లబ్ధి పొందినవారి గురించి కలెక్టర్‌ వాసుదేవ వినోద్‌కుమార్‌ను ఆరా తీశారు. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఓ మహిళ కిరాణా దుకాణం విజయవంతంగా నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన చంద్రబాబు ఆ దుకాణాన్ని స్వయంగా సందర్శించి, ఆమెతో కాసేపు సంభాషించారు.

  • సీఎం: ఏం తల్లీ బాగున్నారా...? మా ప్రభుత్వంలో ఏమైనా సంక్షేమ పథకాలు అందాయా?

  • జేజేమ్మ: అందాయి సార్‌..

  • సీఎం: ఏమేమి పథకాలు అందాయామ్మా?

  • జేజేమ్మ: డ్వాక్రా సంఘం తరఫున రూ.2 లక్షల రుణం తీసుకున్నాను.

  • సీఎం: ఆసొమ్మును ఎలా వినియోగించుకున్నారు?

  • జేజేమ్మ: కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకున్నాను

  • సీఎం: వ్యాపారం ఎలా జరుగుతోంది?

  • జేజేమ్మ: బాగానే సాగుతోంది సార్‌.

  • సీఎం: ఇంకేమైనా పథకాలు అందాయా?

  • జేజేమ్మ: అందాయండి.. ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. మా అత్త గారికి దీపం పథకం, మామగారికి వృద్దాప్య పింఛన్‌, మా వారికి అన్నదాత సుఖీభవ పథకం అందాయండి.

  • సీఎం: సంతోషమేనా?

  • జేజేమ్మ: చాలా సంతోషంగా ఉంది.

  • సీఎం: అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందడం మాకు సంతృప్తినిస్తుంది. ఇంకేమైనా సహాయం కావాలా?

  • జేజేమ్మ: వ్యాపారాభివృద్ధికి ఆర్థిక సహాయం చేయండి. అద్దె ఇంట్లో ఉంటున్నాం. సొంతిల్లు ఇప్పించండి సార్‌.

  • సీఎం: అలాగేనమ్మా. (ఆ కుటుంబానికి కావాల్సిన ఆర్థిక సాయంతో పాటు సొంత ఇల్లు పరిశీలన చేసి ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు చంద్రబాబు సూచించారు.)

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:42 AM