Share News

మరో రెండు రోజులు అప్రమత్తం

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:32 AM

మురసు తుఫాన్‌ తీరం దాటిన నేపథ్యంలో సహాయ చర్యలకు అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

మరో రెండు రోజులు అప్రమత్తం

  • సహాయక చర్యలకు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి

  • చివరి వ్యక్తికీ సాయం అందేవరకు విశ్రమించవద్దు

  • తుఫాన్‌ ప్రభావంపై చంద్రబాబు వరుస సమీక్షలు

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్‌ తీరం దాటిన నేపథ్యంలో సహాయ చర్యలకు అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. తుఫాన్‌ ప్రభావంపై మంగళవారం తెల్లవారుజామున, ఉదయం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ సెంటర్‌ నుంచి సమీక్ష జరిపి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎక్కడా ప్రాణనష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తి నష్టాన్ని కూడా వీలైనంత వరకూ నివారించాలి. తుఫాన్‌ అనంతర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. చివరి వ్యక్తికీ సాయం అందేవరకు విశ్రమించవద్దు. క్షేత్రస్థాయి సిబ్బంది తక్షణ స్పందనతో బాధితుల్లో సానుకూల స్పందన వస్తుంది. 21 పట్టణ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. మున్సిపల్‌ కమిషనర్లను అప్రమత్తం చేసి, క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. వర్షం నీరు వృథా కాకుండా చెరువులకు మళ్లించాలి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగితే యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని, వేగంగా పునరుద్ధరించాలి. ప్రతి అంశంలో డేటా డ్రివెన్‌ డెసిషన్‌ మేకింగ్‌ జరగాలి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడగలిగాం’ అని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 04:32 AM