ఆ విధంగా... ‘వెనక్కి’!
ABN , Publish Date - Sep 17 , 2026 | 02:40 AM
‘‘ప్రజలు తమ అవసరాలకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండొద్దు. అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందించాలి’’... ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పే మాట! దీనికి అనుగుణంగా సుమారు 300 సేవలను ‘మీ సేవ’ యాప్ ద్వారానే ఇస్తున్నారు. కానీ... ఇప్పుడు అత్యంత విచిత్రంగా ఒక తిరోగమన చర్యకు తెరలేపారు.
రెవెన్యూ శాఖ తిరోగమన చర్య
నివాస సర్టిఫికెట్లు కావాల్సిందే..
‘మరక’ మంచిదో కాదో తెలియదుకానీ...
‘మార్పు’ మాత్రం మంచిదై ఉండాలి!
‘పాత రోజులు’ మంచివో కావో తెలియదుకానీ...
పాత రోజుల్లోని కష్టాలు మాత్రం మంచివి కావు!
తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిందే!
11ఏళ్ల నాడు ఇచ్చిన వెసులుబాటుకు సెలవు
అక్కర్లేని సర్టిఫికెట్ కోసం విద్యార్థులకు తిప్పలు
ఆధార్, రేషన్ కార్డు చాలంటూ 2015లో జీవో
ఇప్పుడు పాత కష్టాలకు తెరలేపుతూ ఉత్తర్వులు
అహేతుక కారణాలతో అనవసరమైన చర్య
కానీ... ప్రభుత్వం ప్రజలకు ఏమాత్రం మంచిదికాని, మళ్లీ పాతరోజుల్లోని కష్టాల్లోకి నెట్టేసే మార్పును తీసుకొచ్చింది. స్థానిక నివాస ధ్రువపత్రం (రెసిడెన్షియల్ సర్టిఫికెట్) కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాలని ఆదేశించింది. అధికారుల స్థాయిలో వచ్చిన ఈ ప్రతిపాదనలో ఏమాత్రం హేతుబద్ధత లేదు. అయినప్పటికీ... దానిని ఆమోదిస్తూ జీవో జారీ అయ్యింది.
(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలు తమ అవసరాలకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండొద్దు. అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందించాలి’’... ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పే మాట! దీనికి అనుగుణంగా సుమారు 300 సేవలను ‘మీ సేవ’ యాప్ ద్వారానే ఇస్తున్నారు. కానీ... ఇప్పుడు అత్యంత విచిత్రంగా ఒక తిరోగమన చర్యకు తెరలేపారు. పెద్దగా ఉపయోగపడని, అంతగా ప్రాధాన్యం లేని స్థానిక నివాస (రెసిడెన్షియల్) సర్టిఫికెట్ కోసం తహసీల్దార్‌ను ఆశ్రయించాలట! అసలు విషయం ఏమిటంటే...
ఈ సర్టిఫికెట్ కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ 2015లో చంద్రబాబు ప్రభుత్వమే జీవో 581 జారీ చేసింది. ఈ పదకొండేళ్లలో సాంకేతికత అనేక రెట్లు పెరిగి, వాట్సాప్ గవర్నెన్స్ కూడా నడుస్తోంది. ఇప్పుడు... జీవో 581ను రద్దు చేస్తూ... రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సిందే అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్న చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు(జీఓ 592) జారీ చేశారు.అలా ఉండేది... విద్యాసంస్థల్లో అడ్మిషన్ కోసం నేటివిటీ సర్టిఫికెట్‌ను కూడా ధ్రువపరుస్తారు. అంతకుమించి దీనికి పెద్దగా ప్రాధాన్యం లేదు. అయినప్పటికీ...
ఈ ధ్రువపత్రం కోసం విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు దరఖాస్తు చేస్తే... ఎప్పుడు ఇస్తారో తెలిసేది కాదు! దీనికోసం సమయం, ఖర్చు, శ్రమ... అన్నీ వెచ్చించాల్సిందే! అక్కర్లేని ఈ ప్రయాసలు తన దృష్టికి రాగానే... 2015లోనూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు స్పందించారు. పౌరుల నివాసాన్ని ధ్రువీకరించేందుకు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులు సరిపోతాయని స్పష్టంచేశారు. ఈ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ కార్యదర్శితో 2015 జూన్ 1న రెవెన్యూశాఖ సెక్రెటరీకి లేఖ రాయించారు. ఈ లేఖ ఆధారంగానే... తహసీల్దార్ల ద్వారా నివాస సర్టిఫికెట్ల జారీని నిలిపివేస్తూ... నివాస ధ్రువీకరణ కోసం రేషన్‌కార్డు, ఆధార్‌కార్డును ఉపయోగిస్తే చాలంటూ 2015 జూన్ 20న నాటి రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులు (జీఓ 581) జారీ చేశారు. అప్పట్లో ఇది సంచలనం. దీనిపై విద్యార్థులు, సామాన్య ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం కూడా నివాస ధ్రువపత్రం గురించి ఎవరినీ ఒత్తిడి చేయడంలేదు. మరోవైపు... పాస్‌పోర్టుతో సహా అనేక అంశాలకు ఆధార్‌కార్డు ప్రామాణికంగా మారింది.
ఇప్పుడు మళ్లీ ఇలా... జీవో 581 ద్వారా విద్యార్థుల కష్టాలు తొలగించిన పదకొండేళ్లకు ప్రభుత్వం మళ్లీ ‘వెనక్కి’ వెళ్లింది. ‘నేటివిటీ సర్టిఫికెట్ కావాల్సిందే. అది కూడా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తెచ్చుకోవాల్సిందే’ అని రెవెన్యూ శాఖ తేల్చింది. 2015లో సర్కారు తీసుకొచ్చిన జీఓ 581ను రద్దు చేస్తూ... తాజాగా జీఓ 592 జారీ చేసింది. ఎందుకంటే... ‘‘గ్రామ, వార్డు సచివాలయం నుంచి ఓ ప్రతిపాదన వచ్చింది. తహసీల్దార్ డిజిటల్ సంతకం లేదా క్యూఆర్ కోడ్‌తో జారీచేసే నివాస సర్టిఫికెట్ ఇవ్వాలని కోరింది. దీంతోపాటు విద్య, ఉద్యోగాలు, ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్ కోసం నివాస సర్టిఫికెట్ల అవసరం ఉందని మా దృష్టికి వచ్చింది’’ అని రెవెన్యూ శాఖ పేర్కొంది. ఆ మేరకు మళ్లీ తహసీల్దార్లు నివాస సర్టిఫికెట్లు జారీచేసే విధానం తీసుకురావాలని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) రెవెన్యూ శాఖకు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఆధారంగా జీఓ 581 అమలును నిలిపివేసి... కొత్త జీవో ఇచ్చారు. అంటే... 11 ఏళ్ల కిందట చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ఇప్పుడు మళ్లీ అదే ప్రభుత్వం రద్దు చేసిందన్నమాట!
హేతుబద్ధత ఏదీ??
తాజా జీఓను పరిశీలిస్తే... రెవెన్యూశాఖ చెబుతున్న కారణాలేవీ కొత్తవి కావు. అవేవీ సహేతుకంగా లేవు. ఎందుకంటే, రాష్ట్రంలో సర్ ప్రక్రియ ముగిసిపోయింది. విద్యా, ఉద్యోగాలకు నివాస సర్టిఫికెట్లతో పనిలేదు. పౌరుల రేషన్, ఆధార్‌కార్డులతోపాటు 10వ తరగతి సర్టిఫికెట్‌లపైనే అన్నీ ఉంటున్నాయి. విద్యార్థులకూ ఇదే వర్తిస్తుంది. ఈ రోజుల్లో ప్రతిదానికీ ఆధార్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయినా సరే... రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్‌ను ఆశ్రయించాలనడమేమిటో!? ప్రజలు మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగడం వల్ల ఎవరికి ‘లాభం’ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ఈ ఉత్తర్వు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదంతోనే ఇచ్చారా? లేక రెవెన్యూ శాఖ సొంత ఆలోచనా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య