పురపాలక సవరణ బిల్లుకు.. ఏపీ అసెంబ్లీ గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:32 PM
అమరావతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియను సులభతరం చేసే కీలక నిర్ణయానికి ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల మూడో సవరణ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టగా.. స్వల్ప చర్చ అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది. వివరాల్లోకి వెళితే..
అమరావతి, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల మూడో సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మంత్రి నారాయణ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా.. స్వల్ప చర్చ అనంతరం సభ ఆమోదించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, మున్సిపల్ రికార్డుల్లో యజమాని పేరు మార్పు ప్రక్రియను వేగవంతం చేసేలా ప్రభుత్వం ఈ సవరణలు చేసింది.
రిజిస్ట్రేషన్‌తోనే మున్సిపల్ రికార్డుల్లో పేరు మార్పు..
ప్రస్తుతం ఆస్తి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మున్సిపాలిటీల్లో యజమాని పేరు నమోదు కోసం విడిగా మ్యుటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి వస్తోంది. ఇకపై రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే మున్సిపల్ రికార్డుల్లోనూ యజమాని పేరు ఆటోమేటిక్‌గా మారేలా వ్యవస్థను అనుసంధానం చేయనున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ ఫీజు చెల్లించేలా చట్టంలో మార్పులు చేశారు. అలాగే కార్పొరేషన్లు, గ్రేడ్‌ల వారీగా ఉన్న మున్సిపాలిటీల్లో మ్యుటేషన్‌కు ఏకీకృత ఫీజులు అమలు చేసేలా సవరణలు తీసుకొచ్చారు. దీంతో ఆస్తుల బదలాయింపు ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్
ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే..