కాంతిరాణా, విశాల్ గున్నికి పోస్టింగులు
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:09 AM
సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నిపై ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేసిన రాష్ట్రప్రభుత్వం ఆదివారం వారికి పోస్టింగులు ఇచ్చింది. కాంతిరాణాను ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్‌సేఫ్టీ ఐజీగా నియమించింది. విశాల్ గున్నికి ట్రైనింగ్ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది.
రోడ్‌సేఫ్టీ ఐజీగా టాటా.. ట్రైనింగ్ డీఐజీగా గున్ని
మార్కాపురం ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా
పల్నాడుకు జగదీశ్, పోలవరం ఎస్పీగా కె.చక్రవర్తి
9 మంది ఐపీఎస్‌ల బదిలీ, పోస్టింగ్
అమరావతి, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నిపై ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేసిన రాష్ట్రప్రభుత్వం ఆదివారం వారికి పోస్టింగులు ఇచ్చింది. కాంతిరాణాను ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్‌సేఫ్టీ ఐజీగా నియమించింది. విశాల్ గున్నికి ట్రైనింగ్ డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. దీంతోపాటు ఏపీ పోలీసు అకాడమీ (అప్పా) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. మొత్తంగా 9 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీచేసి కొత్త పోస్టింగులు ఇచ్చింది. ఎస్పీఎఫ్ డీజీగా ఉన్న త్రివిక్రమ్ వర్మను ఎఫ్‌ఎస్ఎల్ డైరెక్టర్‌గా, ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మిని సీఐడీ సైబర్ క్రైమ్ ఐజీగా నియమించింది. ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీ బి.రాజకుమారిని రైల్వేస్ ఐజీగా నియమించింది. సీఐడీలో ఉమెన్ సేఫ్టీ ఐజీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రేహౌండ్స్ డీఐజీ అట్టాడ బాబూజీని టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా నియమించింది. గ్రేహౌండ్స్ డీఐజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పోలవరం ఓఎస్‌డీ పంకజ్ కుమార్ మీనాను మార్కాపురం ఎస్పీగా నియమించింది. సీఎంఎస్‌జీ ఎస్పీగా ఉన్న జగదీశ్ అదహళ్లిని పల్నాడు ఎస్పీగా బదిలీచేసింది. సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తిని పోలవరం జిల్లా ఎస్పీగా నియమించింది.
ఈ వార్తలనూ చదవండి..