ఏపీ, గుజరాత్ ఏకతాటిపై ఉండాలి
ABN , Publish Date - Sep 25 , 2026 | 04:10 AM
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఏపీ మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. గురువారం గాంధీనగర్‌కు చేరుకున్న లోకేశ్ నేరుగా భూపేంద్ర నివాసానికి వెళ్లారు. తీరప్రాంత రాష్ట్రాల అభివృద్ధి, పారిశ్రామిక నియంత్రణ సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన చర్చల్లో ఏపీ, గుజరాత్ ఏకతాటిపై ఉండాలని కోరారు.
టీటీడీ శ్రీవారి ఆలయానికి భూమి కేటాయించండి
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మంత్రి లోకేశ్
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఏపీ మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. గురువారం గాంధీనగర్‌కు చేరుకున్న లోకేశ్ నేరుగా భూపేంద్ర నివాసానికి వెళ్లారు. తీరప్రాంత రాష్ట్రాల అభివృద్ధి, పారిశ్రామిక నియంత్రణ సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన చర్చల్లో ఏపీ, గుజరాత్ ఏకతాటిపై ఉండాలని కోరారు. పశ్చిమ తీరంలోని గుజరాత్, తూర్పుతీరంలో గేట్‌వేగా ఉన్న ఏపీ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర, పోర్టుల ఆధారిత పరిశ్రమ పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తుందన్నారు. కోస్ట్ టు కోస్ట్ వాణిజ్య కారిడార్ ఏర్పాటును పరిశీలించాలని కోరారు. గుజరాత్ మోడల్ సముద్ర రవాణా అభివృద్ధిలో భాగంగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట నాన్ మేజర్ పోర్టులను ఏపీ అభివృద్ధి చేస్తోందన్నారు. గుజరాత్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గిఫ్ట్ సిటీ ఫ్రేమ్ వర్క్‌ను ఆదర్శంగా తీసుకుని నవ్యాంధ్రలో వైజాగ్, అమరావతి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
విజయవాడ ఉత్సవ్‌కు రండి
అక్టోబరు 11 నుంచి 20 వరకు పున్నమి ఘాట్ వేదికగా జరగనున్న విజయవాడ ఉత్సవ్‌కు హాజరుకావాల్సిందిగా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌ను లోకేశ్ ఆహ్వానించారు. గుజరాత్‌లో టీటీడీ ఆధ్వర్యాన శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నామని, ఇందుకు అవసరమైన భూమి కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలనూ చదవండి...
అదానీ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు..