అల్లూరులో రెండో రోజూ నామినేషన్లు నిల్
ABN , Publish Date - Nov 16 , 2026 | 01:47 AM
నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీకి ఎన్నికలు జరపాలని ప్రకటించిన నేపథ్యంలో అధికారులు నామినేషన్ల స్వీకరణకు సిద్ధమయ్యారు.
అల్లూరు, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీకి ఎన్నికలు జరపాలని ప్రకటించిన నేపథ్యంలో అధికారులు నామినేషన్ల స్వీకరణకు సిద్ధమయ్యారు. మూడు రోజులపాటు చేపట్టిన ఈ ప్రక్రియలో రెండో రోజైన ఆదివారం కూడా ఒక్క నామినేషనూ దాఖలు కాలేదు.
అల్లూరును గ్రామ పంచాయతీగానే ఉంచాలని, నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ చేయాలన్న నిర్ణయాన్ని ప్రజలతోపాటు.. అన్ని పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోగా, మరోవైపు ఇప్పటికే నగర పంచాయతీకి వ్యతిరేకంగా ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు
ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!