కోస్తాంధ్రకు మరో తుఫాన్ ముప్పు!
ABN , Publish Date - Oct 30 , 2026 | 03:55 AM
అర్నబ్ తుఫాన్ బీభత్సం నుంచి కోలుకోకముందే మరో తుఫాన్ కోస్తాంధ్ర దిశగా రానున్నది. ఐఎండీ, ఐరోపా వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం నవంబరు 2న లేదా 3న తుఫాన్/వాయుగుండం మధ్య కోస్తాలో మచిలీపట్నం, బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం
వాయుగుండం/తుఫాన్‌గా మారే అవకాశం
2 లేదా 3న మచిలీపట్నం, బాపట్ల మధ్య తీరంపైకి?
మరో 4 రోజులు వర్షాలు: విపత్తుల సంస్థ
విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ బీభత్సం నుంచి కోలుకోకముందే మరో తుఫాన్ కోస్తాంధ్ర దిశగా రానున్నది. ఐఎండీ, ఐరోపా వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం నవంబరు 2న లేదా 3న తుఫాన్/వాయుగుండం మధ్య కోస్తాలో మచిలీపట్నం, బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 31కల్లా ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తూ వాయుగుండంగా బలపడనున్నది. ఇది మరింత బలపడి నవంబరు రెండు లేదా మూడో తేదీకల్లా కోస్తాంధ్ర తీరం దిశగా రానున్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది.
నవంబరు 2లేదా 3వ తేదీ నాటికి మచిలీపట్నం, బాపట్ల మధ్య తీరం దాటుతుందని వాతావరణ నిపుణుడొకరు అంచనా వేశారు. ఈ నెల 31 నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని, నవంబరు 1 నుంచి మధ్య కోస్తాంధ్రలో వర్షాలు పెరుగుతాయని, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న నాలుగు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు