Share News

అన్నమయ్య జిల్లాలో దారుణం.. భార్యను కత్తితో నరికి హత్య చేసిన భర్త..

ABN , Publish Date - Aug 29 , 2026 | 09:14 PM

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లి జగన్ కాలనీలో పాత నేరస్థుడైన భర్త మధుకర్ రెడ్డి తన భార్య దండామణిని కత్తితో నరికి హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది. జైలు నుంచి విడుదలైన 15 రోజులకే ఈ ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా సంచలనంగా మారింది.

అన్నమయ్య జిల్లాలో దారుణం.. భార్యను కత్తితో నరికి హత్య చేసిన భర్త..
Annamayya district crime

అన్నమయ్య, ఆగస్టు 29: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లి మండలం జగన్ కాలనీలో భార్య దండామణిని ఆమె భర్త మధుకర్ రెడ్డి కత్తితో నరికి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న భార్యతో మధుకర్ రెడ్డి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన మధకర్ కత్తితో దాడి చేసి భార్యను హతమార్చినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


మధుకర్ రెడ్డి పాత నేరస్థుడిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అతడిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో నమోదైన ఓ క్రిమినల్ కేసులో అతడు పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 15 రోజుల క్రితమే జైలు నుంచి విడుదలై మదనపల్లికి వచ్చిన మధుకర్ రెడ్డి.. భార్య దండామణితో గొడవకు దిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల ఖచ్చితమైన కారణం, ఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ మెట్రో ఆన్‌లైన్ టికెటింగ్ సేవల్లో అంతరాయం

ప్రోటోకాల్ ఉల్లంఘన.. అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సీరియస్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 29 , 2026 | 09:26 PM