టీడీపీతో పోటీగా వైసీపీ నామినేషన్లు
ABN , Publish Date - Oct 25 , 2026 | 05:01 AM
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా నామినేషన్లు దాఖలు చేశాయి. అధికార టీడీపీతో పోటీగా వైసీపీ నామినేషన్లు వేసింది. 28 జిల్లాల్లో 659 జెడ్పీటీసీ స్థానాలకుగానూ మొత్తం 5724 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
జడ్పీటీసీలకు టీడీపీ 2078 వైసీపీ 1815
ఎంపీటీసీలకు టీడీపీ 22,013, వైసీపీ 20,556
అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ప్రధాన రాజకీయ పార్టీలు భారీగా నామినేషన్లు దాఖలు చేశాయి. అధికార టీడీపీతో పోటీగా వైసీపీ నామినేషన్లు వేసింది. 28 జిల్లాల్లో 659 జెడ్పీటీసీ స్థానాలకుగానూ మొత్తం 5724 నామినేషన్లు దాఖలు అయ్యాయి. టీడీపీ నుంచి 2078 నామినేషన్లు దాఖలు కాగా, వైసీపీ తరఫున 1815 మంది నామినేషన్లు వేశారు. జనసేన పార్టీ నుంచి 679, బీజేపీ తరఫున 255 నామినేషన్లు దాఖలయ్యాయి. 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీ స్థానాలకుగానూ మొత్తం 51,902 నామినేషన్లు దాఖలయ్యాయి. 22,013 నామినేషన్లు టీడీపీ నుంచి 20,556 నామినేషన్లు వైసీపీ నుంచి వచ్చాయి.
జనసేన పార్టీ తరఫున 4609 మంది నామినేషన్లు, బీజేపీ నుంచి 1150 నామినేషన్లు దాఖలయ్యాయి. ‘ఇంత భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైనా... కూటమి ప్రభుత్వంపై, వైసీపీ అధ్యక్షుడు జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇది విడ్డూరంగా ఉంది’ అని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
ఈ వార్తలనూ చదవండి: