Share News

కారు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:38 AM

జోగి మేఘనతోపాటు ఆమె కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ పోలీసులను ఆదేశించారు. మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుటుంబ సభ్యులు 11 మందిపై మేఘన కేసు పెట్టిన విషయం తెలిసిందే.

కారు ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు

పోలీసులకు మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఆదేశం

అమరావతి/మంగళగిరి/విజయవాడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జోగి మేఘనతోపాటు ఆమె కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ పోలీసులను ఆదేశించారు. మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుటుంబ సభ్యులు 11 మందిపై మేఘన కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15న ఆమె విజయవాడలో న్యాయవాది వద్దకు వచ్చారు. తిరిగి వెళ్తున్న సమయంలో ఇబ్రహీంపట్నం రింగ్‌ వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు వారి వాహనాన్ని ఢీ కొట్టింది. 16వ తేదీన ఆమె తండ్రి కృష్ణ ఈ ప్రమాదం వెనుక జోగి రమేశ్‌ ప్రమేయంపై అనుమానాలు వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ప్రమాద ఘటనపై అనుమానాలున్నాయని మేఘన శుక్రవారం మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్‌ శైలజ ఇబ్రహీంపట్నం పోలీసులతో మాట్లాడారు. వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 05:38 AM