Share News

స్థిరంగా అల్పపీడనం

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:44 AM

దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్లో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి అక్కడే స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి శనివారం నాటికి వాయుగుండంగా బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.

స్థిరంగా అల్పపీడనం

  • వాయుగుండంగా మారి 2న ఒంగోలు- నిజాంపట్నం మధ్య తీరం దాటే చాన్స్‌

  • 2 నుంచి 4వ తేదీ వరకు భారీ వర్షాలు

విశాఖపట్నం, అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవుల్లో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి అక్కడే స్థిరంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి శనివారం నాటికి వాయుగుండంగా బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. వాయుగుండం ఒకటో తేదీ నాటికి కోస్తాంధ్ర వైపు వస్తుందని, రెండో తేదీకల్లా తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఇస్రో వాతావరణ విభాగం నిపుణుడు పేర్కొన్నారు. మూడో తేదీన ఒంగోలు, నిజాంపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనావేశారు. దీని ప్రభావంతో నవంబరు రెండు, మూడో తేదీల్లో గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీవర్షాలు, అక్కడక్కడా కుంభవృష్టి కురుస్తుందని హెచ్చరించారు.

దక్షిణ కోస్తాలోని మిగిలిన జిల్లాలు, ఉత్తరకోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. కాగా అర్నబ్‌ తుఫాన్‌ బలహీనపడి అల్పపీడనంగా మారి మధ్య భారతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా, అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింబాహుదాలో వరద తగ్గుముఖం

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 02:46 AM