ప్రత్యేక టెట్‌లో 96.06శాతం ఉత్తీర్ణత
ABN , Publish Date - Nov 17 , 2026 | 04:08 AM
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్‌లో 96.06 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
ఫలితాలు విడుదల చేసిన కన్వీనర్
తీరిన ఉపాధ్యాయుల ‘టెట్ కష్టాలు’
అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక టెట్‌లో 96.06 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 68,420 మంది టీచర్లు 83,015 పేపర్లకు దరఖాస్తు చేసుకుని పరీక్షలు రాశారు. వీరిలో 79,743 పేపర్లలో ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించారు. టెట్-టు-డీఎస్సీ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి అభ్యర్థులు తమ ఫలితాలు తెలుసుకోవచ్చని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక టెట్‌పై హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో ఫలితాలు ఇప్పట్లో విడుదల చేయరేమోనన్న ఆందోళన నెలకొంది. అయితే, ఫలితాలు ఆపాలని కోర్టు చెప్పకపోవడంతో సోమవారం ఫలితాలు విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్