Share News

పర్యాటకంలో 10 ఒప్పందాలు

ABN , Publish Date - Nov 14 , 2026 | 06:06 AM

రాష్ట్ర పర్యాటక రంగంలో రూ.860 కోట్ల పెట్టుబడులకు 10 ఒప్పందాలు జరిగాయి. సీఐఐ సదస్సు వేదికగా శుక్రవారం పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ సమక్షంలో ఈ ఎంవోయూలు చేసుకున్నారు.

పర్యాటకంలో 10 ఒప్పందాలు

  • 860 కోట్ల పెట్టుబడులు.. పెట్టుబడులకు భద్రత కల్పిస్తాం: దుర్గేశ్‌

రాష్ట్ర పర్యాటక రంగంలో రూ.860 కోట్ల పెట్టుబడులకు 10 ఒప్పందాలు జరిగాయి. సీఐఐ సదస్సు వేదికగా శుక్రవారం పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ సమక్షంలో ఈ ఎంవోయూలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం భద్రత కల్పించి, ప్రోత్సాహకాలు ఇస్తుందని చెప్పారు.

ఒప్పందాలు చేసుకున్న కంపెనీల్లో కివా హోటల్‌ అండ్‌ హాస్పటాలిటీ (కుప్పం), బాపురం గ్రాండ్‌ హోటల్స్‌ (కర్నూలు), హిల్లోరా ఎకో రిసార్ట్‌ (విజయనగరం), జీఏఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (రాజమహేంద్రవరం), రేడియన్‌ ప్రాజెక్ట్స్‌ (విజయనగరం), శ్రీవెన్‌ గ్రూపు (విశాఖపట్నం), పీఆర్‌ హోటల్స్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (విశాఖపట్నం), ఎంటీజే ప్రైవేటు లిమిటెడ్‌ (విశాఖపట్నం), శ్రీ సిద్ధార్థ ఇన్‌ఫ్రా టెక్‌ అండ్‌ సర్వీసెస్‌ (విశాఖపట్నం), న్యూ ఏజ్‌ మీడియా పార్టనర్‌ ఉన్నాయి. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌. రావత్‌, కార్యదర్శి అమ్రపాలి, పర్యాటక సంస్థ ఎండీ పటాన్‌ శెట్టి రవి సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 06:06 AM