Share News

582 జెడ్పీటీసీలకు పోటీ

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:06 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ప్రకటించింది. ఏకగ్రీవ ఎన్నికల ఫలితాలనూ వెల్లడించింది. 28 జిల్లాల్లోని మొత్తం 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా..

582 జెడ్పీటీసీలకు పోటీ

7844 ఎంపీటీసీలకు కూడా..

తుది జాబితాను ప్రకటించిన ఎస్‌ఈసీ

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ప్రకటించింది. ఏకగ్రీవ ఎన్నికల ఫలితాలనూ వెల్లడించింది. 28 జిల్లాల్లోని మొత్తం 9829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా.. వీటిలో 1985 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 7844 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రకటించగా.. 77 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 జడ్పీటీసీ స్థానాలకు వచ్చే నెల 5న ఎన్నికలు జరుగనున్నాయి. ప్రకటించిన ఎంపీటీసీ స్థానాల్లో 20.20 శాతం, జడ్పీటీసీ స్థానాల్లో 11.7 శాతం ఏకగ్రీవమయ్యాయి.

ఎంపీటీసీల్లో పల్నాడు జిల్లాలో అత్యధికంగా 382 ఏకగ్రీవమయ్యాయి. కడప జిల్లాలో 358, మార్కాపురం జిల్లాలో 217, అన్నమయ్య జిల్లాలో 169, ప్రకాశం జిల్లాలో 153 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

జడ్పీటీసీల్లో కడపలో అత్యధికంగా 23 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పల్నాడు జిల్లాలో 18, నంద్యాల జిల్లాలో 8, మార్కాపురం జిల్లాలో 6 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాల వివరాలనూ ఎస్‌ఈసీ తన నివేదికలో పొందుపరచింది.

బరిలో వీరే..: ఎంపీటీసీ పోరులో 7844 స్థానాలకు 18,952 మంది బరిలో నిలిచారు. అందులో టీడీపీ నుంచి 6423, జనసేన 1521, బీజేపీ 285.. వైసీపీ తరఫున 7632, కాంగ్రెస్‌-326, సీపీఎం-259, బీఎస్పీ-133, ఆప్‌-3, ఇతర పార్టీలు-131, స్వతంత్రులు 2239 చోట్ల పోటీలో ఉన్నారు. 582 జడ్పీటీసీ స్థానాలకు 2169 మంది బరిలో ఉన్నారు. పార్టీల వారీగా టీడీపీ 452, జనసేన 109, బీజేపీ 34.. వైసీపీ 574, కాంగ్రెస్‌-270, సీపీఎం-47, బీఎస్పీ-107, ఆప్‌-9, ఇతర పార్టీలు 64, స్వతంత్ర అభ్యర్థులు 503 స్థానాల్లో బరిలో ఉన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 04:06 AM