Share News

పంచాయతీ’ రెండో దశకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Nov 17 , 2026 | 04:25 AM

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నిక ల రెండోదశ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ జారీచేసింది

పంచాయతీ’ రెండో దశకు నోటిఫికేషన్‌
PANCHYATH

  • రేపటి నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ

  • 4960 సర్పంచ్‌ పదవులకు,49,224 వార్డులకు ఎన్నికలు

  • 29న పోలింగ్‌, ఫలితాలు

అమరావతి, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నిక ల రెండోదశ నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ జారీచేసింది. 4960 సర్పంచ్‌ పదవులకు, 49,224 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. బుధవారం(18వ తేదీ) నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న వాటిని పరిశీలిస్తారు. తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లను 23న పరిష్కరిస్తారు. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 24వ తేదీ ఆఖరి రోజు. 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్‌ నిర్వహించి.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అదేరోజు ఉపసర్పంచ్‌ ఎన్నిక కూడా జరుగుతుం ది. అవసరమైన ప్రాంతాల్లో 30వ తేదీన రీపోలింగ్‌ జరుపుతారు. రెండో దశలో విశాఖపట్నం జిల్లాకు ఎన్నికలు నిర్వహించడం లేదు. మూడో దశలో ఆ జిల్లాలోని 4 మండలాలకు ఎన్నికలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి..

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్

Updated Date - Nov 17 , 2026 | 05:17 AM