Share News

నేడే పుర పోరు

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:10 AM

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పురపాలక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మొత్తం 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా..

నేడే పుర పోరు

  • 13 కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలకు ఎన్నికలు

  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌

  • 99.36 లక్షల మంది ఓటర్లు .. 11,378 పోలింగ్‌ కేంద్రాలు

  • మేయర్‌, చైర్‌పర్సన్ల బరిలో 520 మంది

  • వార్డు సభ్యులుగా 9742 మంది పోటీ

  • ఎన్నికల నిర్వహణకు 1.36 లక్షల సిబ్బంది

  • ఎల్లుండి ఓట్ల లెక్కింపు, ఫలితాలు

అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పురపాలక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మొత్తం 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 8 పట్టణ స్థానిక సంస్థల్లో చైర్‌పర్సన్లు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 92 పట్టణ సంస్థలు.. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. 99,36,014 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

వీరిలో మహిళా ఓటర్లే అధికం. వారి సంఖ్య 51,05,345 కాగా.. పురుష ఓటర్లు 48,29,226 మంది. 1443 మంది ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) వెల్లడించింది. పురుషుల కంటే మహిళా ఓటర్లు 2,76,119 మంది అధికంగా ఉండడం విశేషం. 13 కార్పొరేషన్ల పరిధిలో 59,97,918 మంది, 79 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో 39,38,096 మంది ఓటర్లు ఉన్నారు. రీపోలింగ్‌ అవసరమైతే సోమవారం నిర్వహిస్తారు. మంగళవారం (3న) ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.


11,378 పోలింగ్‌ కేంద్రాలు.. బ్యాలెట్‌ పేపర్లపై ఎన్నికల నిర్వహణకు మొత్తం 12244 పోలింగ్‌ కేంద్రాలను నోటిఫై చేయగా.. ఏకగ్రీవ వార్డులను మినహాయించిన తర్వాత అవసరమైన పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 11,378కు తగ్గింది. వీటిలో కార్పొరేషన్లలో 6384, మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు 4994 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 1449 మంది రిటర్నింగ్‌ అధికారులు/ఎన్నికల అధికారులకు అప్పగించారు. వీరిలో 376 మంది కార్పొరేషన్లకు, 1073 మంది మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు నియమితులయ్యారు. వీరికి అదనంగా 2543 మంది సహాయ, అదనపు రిటర్నింగ్‌ అధికారులు, ఎన్నికల అధికారులు పనిచేస్తున్నారు.

పోలింగ్‌ కేంద్రాల్లో 13,504 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, మరో 13,504 సహాయ ప్రిసైడింగ్‌ అధికారులు.. ఇతర పోలింగ్‌ సిబ్బంది 51,716 మంది.. మొత్తం 78,724 మంది విధుల్లో ఉన్నారు. వీరికి అదనంగా 588 మంది జోనల్‌ అధికారులు, 1511 మంది రూట్‌ అధికారులు ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించనున్నారు. ఇక మంగళవారం ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 138 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వాటిలో 22 కేంద్రాలు కార్పొరేషన్లలో, 116 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో ఉంటాయి. మొత్తం 556 కౌంటింగ్‌ హాళ్లు, 6831 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌ను నియమిస్తారు. వారికి తోడుగా 27,324 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లు ఉంటారు.


13,662 మంది కౌంటింగ్‌ సిబ్బందిని ప్రత్యేకంగా నిమమించారు. మొత్తంగా 1.36 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలివిడతలో పట్టణ సంస్థలకు జరుగుతున్న ఎన్నికలు ఎస్‌ఈసీకి పెద్దసవాల్‌గా నిలిచాయి. దరిదాపుగా కోటి మంది ఓటర్లు, వేలాది మంది అభ్యర్థులు పాలుపంచుకుంటున్న ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

చైర్‌పర్సన్‌ పదవుల కోసం 367 మంది

13కార్పొరేషన్ల మేయర్‌ స్థానాల కు 153 మంది.. 79 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో చైర్‌పర్సన్‌ స్థానాల కోసం 367 మంది(520 మంది) బరిలోకి దిగారు. 3942 వార్డులు/డివిజన్ల సభ్యుల స్థానాలకు గాను 755 ఏకగ్రీవమయ్యాయి. మిగతా వార్డులు/డివిజన్లకు 9742 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో కార్పొరేషన్లలో 3073 మంది, మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లో 6669 మంది పోటీ చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!

Updated Date - Nov 01 , 2026 | 03:19 AM