Share News

ఏపీ స్థానిక ఎన్నికల్లో 410 కోడ్ ఉల్లంఘన కేసులు.. నివేదిక విడుదల

ABN , Publish Date - Oct 28 , 2026 | 08:05 PM

ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నేటి నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం..

ఏపీ స్థానిక ఎన్నికల్లో 410 కోడ్ ఉల్లంఘన కేసులు.. నివేదిక విడుదల

విజయవాడ, అక్టోబర్ 28: ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నేటి నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఈరోజు(బుధవారం) 410 ఎన్నికల కోడ్ (MCC 1A/1B) ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. అలాగే రాష్ట్రంలో నేడు 7 ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు నమోదు చేశారు. ఇవాళ 47 ఆయుధాలను అధికారులు డిపాజిట్ చేసుకున్నారు. ఈ ఒక్కరోజే బీఎన్ఎస్ సెక్షన్లు 126, 129 కింద 846 బైండోవర్ కేసులు నమోదు అయ్యాయి.


కాగా ఈ నివేదిక ప్రకారం.. అక్టోబర్ 15 నుండి 28 వరకు నమోదైన మొత్తం ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య 251గా ఉంది. ఈ కాలవ్యవధిలోనే మొత్తం 33,505 ఎంసీసీ (MCC 1A/1B) ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 107 మంది వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. అలాగే 9,264 ఆయుధాలను అధికారులు డిపాటిట్ చేసుకున్నారు. కాగా ప్రస్తుతం పనిచేస్తున్న స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌ల సంఖ్య 814గా ఉందని నివేదిక చెబుతోంది.


ఈ వార్తలూ చదవండి

పులివెందులలో వైసీపీకి షాక్..

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్‌ రీ షెడ్యూల్ చేసిన ఈసీ

Updated Date - Oct 28 , 2026 | 09:07 PM