పరిషత్ నామినేషన్లపై వైసీపీ దొంగ ఏడుపు!
ABN , Publish Date - Oct 24 , 2026 | 04:58 AM
స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని మాజీ సీఎం జగన్, ఆయన పార్టీ వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. టీడీపీ కంటే వైసీపీ అభ్యర్థులే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసినట్లు గణాంకాల సాక్షిగా స్పష్టమవుతోంది.
జడ్పీటీసీలకు టీడీపీ కంటే ఆ పార్టీ నుంచే ఎక్కువ నామినేషన్లు
జడ్పీటీసీలకు టీడీపీ కంటే ఆ పార్టీ నుంచే ఎక్కువ నామినేషన్లు
వైసీపీ వేసింది 1092... తెలుగుదేశం 1055
ఎంపీటీసీలకూ పోటాపోటీగా దాఖలు
టీడీపీవి 15,017.. వైసీపీ నుంచి 12,419
అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా తమ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని మాజీ సీఎం జగన్, ఆయన పార్టీ వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. టీడీపీ కంటే వైసీపీ అభ్యర్థులే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసినట్లు గణాంకాల సాక్షిగా స్పష్టమవుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రెండు పార్టీలు హోరాహోరీగా నామినేషన్లు దాఖలు చేశాయి. శుక్రవారం నాటికి 28 జిల్లాల్లో 659 జడ్పీటీసీ స్థానాలకు 2805 నామినేషన్లు దాఖలయ్యాయి.
వీటిలో వైసీపీ అభ్యర్థులవి 1092 కాగా.. టీడీపీ అభ్యర్థులు 1055 వేశారు. జనసేన నుంచి 178, బీజేపీ తరఫున 111 నామినేషన్లు దాఖలయ్యాయి. 28 జిల్లాల్లో 9,829 ఎంపీటీసీలకు గాను మొత్తం 32,095 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీటిలో 15,017 నామినేషన్లు టీడీపీ అభ్యర్థులవి కాగా.. 12,419 నామినేషన్లు వైసీపీవి. జనసేన తరఫున 2073, బీజేపీ నుంచి 562 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల