Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
ABN , Publish Date - Jan 12 , 2026 | 02:40 PM
ఏపీలోని కూటమి ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ బదిలీలు రాష్ట్రంలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఈ ఆదేశాలను జారీ చేయడం ద్వారా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి.
అమరావతి, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సమతుల్యంగా నడిపించేందుకు 14 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె.విజయానంద్ జారీ చేశారు. ఈ మార్పులు జిల్లాస్థాయి పరిపాలనా శాఖల్లో కీలక బాధ్యతలను పునర్విభజన చేసేలా ఉన్నాయి. ఈ బదిలీల్లో పలు ముఖ్యమైన మార్పులు ఉన్నాయి.
బదిలీ, నియామకాలు ఇలా..
పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్ నియామకం
గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీ కల్పన కుమారి బదిలీ
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా కల్పన కుమారి నియామకం
విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ కతవాటె మయూర్ అశోక్ బదిలీ
గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా కతవాటె మయూర్ అశోక్ నియామకం
తిరుపతి జేసీ, తుడా వైఎస్ ఛైర్మన్‌గా ఆర్.గోవిందరావు నియామకం
వైఎస్‌ఆర్ కడప జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ బదిలీ
వైఎస్‌ఆర్ కడప జాయింట్ కలెక్టర్‌గా నిథి మీనా నియామకం
ప్రస్తుతం అనంతపురం జేసీగా ఉన్న శివ్ నారాయణ శర్మ బదిలీ
అనంతపురం జాయింట్ కలెక్టర్‌గా సి.విష్ణు చరణ్ నియామకం
ఎపీటీఎస్ ఎండీ మల్లవరపు సూర్యతేజ బదిలీ
అనకాపల్లి జాయింట్ కలెక్టర్‌గా మల్లవరపు సూర్యతేజ నియామకం
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్ నియామకం
వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్ఎస్ శోబిక బదిలీ
గిరిజన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఎండీగా ఎస్ఎస్ శోబిక నియామకం
చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిల్ల విద్యాధరి బదిలీ
విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా గొబ్బిళ్ళ, విద్యాధరి నియామకం
అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా శివ్ నారాయణ్ శర్మ నియామకం
తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజనా సింహ బదిలీ
పల్నాడు జిల్లా జేసీగా వి.సంజనా సింహ నియామకం
ఈ వార్తలు కూడా చదవండి..
నల్లమల సాగర్‌పై సుప్రీంలో ఊహించని పరిణామం..
భూములు అమ్మి ఖజానా నింపే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And Telugu News