Share News

మరో తుఫానును ఎదుర్కొనేందుకు సిద్ధం!

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:29 AM

మురసు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది.

మరో తుఫానును   ఎదుర్కొనేందుకు సిద్ధం!
AP Govt

  • ‘మురసు’ హెచ్చరికలతో ఆరోగ్య శాఖ అప్రమత్తం

  • 1688 వైద్య బృందాలు.. 116 సహాయ శిబిరాలు

  • ముందస్తుగా ఆస్పత్రులకు గర్భిణుల తరలింపు

అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మురసు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్యశాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది. తుఫాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో 1688 వైద్య బృందాలు, 116 సహాయ శిబిరాలను సిద్ధం చేసింది. మొత్తం 13,165 అత్యవసర పడకలు, అవసరమైన మందులు, 43,672 పాముకాటు నివారణ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచింది. 733 అత్యవసర 108 అంబులెన్సులు, 300 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు, 721 సంచార వైద్య 104 వాహనాలను సిద్ధం చేసింది. ప్రసవం గడువు దగ్గరపడిన గర్భిణులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వైద్యశాలల్లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన మందులను సిద్ధం చేశారు. తీర ప్రాంతాల్లోని 121 ప్రాథమిక, పట్ణణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా 1833 వైద్యశాలల్లో జనరేటర్లు, ప్రత్యామ్నాయ విద్యుత్తు సదుపాయాలను సిద్ధం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అంటువ్యాధుల నిఘా కేంద్రాలను ఏర్పాటు చేసి 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నవంబరు 1 నుంచి 10వ తేదీ మధ్య ప్రసవ గడువు ఉన్న 6870 మంది గర్భిణులను గుర్తించారు.


వీరిలో 493 మంది ఇప్పటికే సమీప వైద్యశాలలకు తరలించారు. మిగిలిన వారిని అవసరం మేరకు ముందుగానే తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారి నివాస ప్రాంతాలకు సమీపం లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో ప్రసవానికి సదుపాయాలు కల్పించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో కలుషిత నీరు, దోమల, ఆహారం ద్వారా వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. వైద్యశాలలు, సహాయ శిబిరాల వద్ద పారిశుధ్య పనుల కు ఏర్పాట్లు చేశారు. నీటిని శుభ్రపరిచేందుకు క్లోరిన్‌ మాత్రలను అందుబాటులో ఉంచారు. సురక్షిత తాగు నీరు అందించేందుకు జిల్లా వైద్యశాఖ అధికారులు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రాహుల్ సభకు 10 లక్షల మంది వచ్చారా.. డ్రోన్ వీడియో విడుదల చేసిన బీజేపీ..

నార్తర్న్ బుల్లెట్ ట్రెయిన్ కారిడార్‌కు ప్రధాని ఆమోదం

Updated Date - Nov 02 , 2026 | 01:50 AM