Share News

బోధనాస్పత్రుల్లో లెవెల్‌-3 ఐసీయూలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:23 AM

ప్రభుత్వాస్పత్రుల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా లెవెల్‌-3 ఐసీయూ (ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

బోధనాస్పత్రుల్లో లెవెల్‌-3 ఐసీయూలు

  • 9 నెలల్లో ఏర్పాటుకు ఆరోగ్య శాఖ ఆదేశం

అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రుల్లో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా లెవెల్‌-3 ఐసీయూ (ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలకు ఆరోగ్యశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐసీయూల్లో మౌలిక సదుపాయాల కల్పన, అత్యవసర వైద్య పరికరాల కొనుగోలు, నిపుణులైన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది నియామకాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల మేరకు... డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్థన్‌ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ప్రత్యేక ఆదేశాలు జారీచేశారు.

సుప్రీంకోర్టు 2026 సెప్టెంబరు 21న జారీచేసిన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ రూపొందించిన ఐసీయూల నిర్వహణ, సేవల మార్గదర్శకాలను అమలు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా ఐసీయూ లెవెల్‌-1కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, వైద్య పరికాలు, సిబ్బంది నియామకాలకు ప్రత్యేక గడువులు నిర్దేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు తొమ్మిది నెలలు ఉన్నా ఇప్పటికే ఉన్న ఐసీయూల స్థానం, పరిమాణం, నిర్మాణంలో అవసరమైన మార్పులు చేసేందుకు 9 నెలల సమయం ఇచ్చారు. బెడ్ల వద్ద అవసరమైన సదుపాయాలను మూడు నెలల్లోగా ఏర్పాటు చేయాలి. నర్సింగ్‌ స్టేషన్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనను 9 నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలానే ఐసీయూల్లో ఇన్ఫెక్షన్‌ నియంత్రణ, రోగుల భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాల్సి ఉంటుంది.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 04:23 AM