Share News

ఉద్యోగుల ‘ఈ-ఎస్ఆర్‌’ గడువు పొడిగింపు

ABN , Publish Date - Oct 30 , 2026 | 12:59 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈ-సర్వీసు రికార్డుల పూర్తి, అప్‌డేషన్‌ ప్రక్రియ గడువును ఈ ఏడాది నవంబరు 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పాత ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియను అక్టోబరు 31 నాటికి పూర్తి చేయాల్సి ఉంది.

ఉద్యోగుల ‘ఈ-ఎస్ఆర్‌’ గడువు పొడిగింపు

అమరావతి, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈ-సర్వీసు రికార్డుల పూర్తి, అప్‌డేషన్‌ ప్రక్రియ గడువును ఈ ఏడాది నవంబరు 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పాత ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియను అక్టోబరు 31 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఉద్యోగుల అభ్యర్థనలు, సాంకేతిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్‌చంద్‌ పేర్కొన్నారు.

భవిష్యత్తులో జరిగే అన్నిరకాల లైవ్‌ సర్వీస్‌ ఈవెంట్లను ఆయా మాడ్యూల్స్‌లో తప్పనిసరిగా నమోదు చేయడానికి తుది గడువును డిసెంబరు 1గా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది. సర్వర్‌ నెమ్మదించడం వంటి సాంకేతిక లోపాలు, వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ అథెంటికేషన్‌ వైఫల్యాలు, స్థానిక సంస్థల ఎన్నికల విధుల వల్ల అవసరమైన పత్రాలను సేకరించడంలో ఎదురవుతున్న జాప్యాన్ని ఈ అసోసియేషన్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 01:01 AM