Share News

ప్రజారోగ్య పరిరక్షణకు 4 అంతర్జాతీయ కమిటీలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:15 AM

‘స్వర్ణాంధ్ర- 2047’ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజారోగ్య సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా అంతర్జాతీయ ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుల సలహా బృందం సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4 కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసింది.

ప్రజారోగ్య పరిరక్షణకు 4 అంతర్జాతీయ కమిటీలు

  • ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఏర్పాటు

అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణాంధ్ర- 2047’ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజారోగ్య సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా అంతర్జాతీయ ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుల సలహా బృందం సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 4 కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసింది. అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ-ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్య సమాచారం-గణాంకాల నిర్వహణ, వైద్య సిబ్బంది నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఈ బృందాలు దృష్టి సారిస్తాయి. నిపుణుల సూచనలకు అనుగుణంగా వైద్య కార్యక్రమాలను మెరుగుపరచడం, శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాయి.

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హెచ్‌ఎల్‌ఈఏజీని ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం శాఖ కమిషనర్‌, జాతీయ ఆరోగ్య మిషన్‌ సంచాలకులు కె.వి.ఎన్‌. చక్రధర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అంటువ్యాధుల నియంత్రణకు అంతర్జాతీయ నిపుణులు ఉప కమిటీలో పీటర్‌ పియోట్‌, గగన్‌దీప్‌ కాంగ్‌, కమిషనర్‌ చక్రధర్‌బాబు సభ్యులుగా ఉంటారు.

అలానే దీర్ఘకాలిక వ్యాధులు-ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అంతర్జాతీయ నిపుణుల ఉపకమిటీలో సౌమ్య స్వామినాథన్‌, నిఖిల్‌ టాండన్‌, నాగేశ్వర్‌రెడ్డి, ఎన్టీఆర్‌ వైద్య సేవల ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణ అధికారి సభ్యులుగా ఉంటారు. ఆరోగ్య సమాచారం-గణాంకాలు, సంజీవని కార్యక్రమానికి సంబంధించి అంతర్జాతీయ నిపుణుల ఉప కమిటీలో రిజ్వాన్‌ కోయిటా, శ్రీకాంత్‌ నాదముని, వై.వై. టియో, ఏపీసాక్స్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ సభ్యులుగా ఉంటారు. అలానే వైద్య సిబ్బంది నైపుణ్యాభివృద్ధి కోసం నియమించిన కమిటీలో ఆర్తి అహుజా, మార్గరెట్‌ క్రుక్‌, డీఎంఈ, డీహెచ్‌లను సభ్యులుగా చేర్చారు.

ఈ వార్తలనూ చదవండి:

కానరాని ఎన్నికల సందడి

భీతావహం

Updated Date - Oct 25 , 2026 | 05:18 AM