పంట నష్టాలు
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:38 AM
భారీ వర్షాలతో కాకినాడ జిల్లాలోని 18 మండలాల్లో 9,882 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. పత్తి 155 హెక్టార్లు, మినుములు 111 హెక్టార్లు, మొక్కజొన్న 72హెక్టార్లలో దెబ్బతింది. జిల్లావ్యాప్తంగా 8,552 మంది రైతులు నష్టపోయారు.
భారీ వర్షాలతో కాకినాడ జిల్లాలోని 18 మండలాల్లో 9,882 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. పత్తి 155 హెక్టార్లు, మినుములు 111 హెక్టార్లు, మొక్కజొన్న 72హెక్టార్లలో దెబ్బతింది. జిల్లావ్యాప్తంగా 8,552 మంది రైతులు నష్టపోయారు. 133 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం జిల్లా బూర్జ, శ్రీకాకుళం రూరల్ మండలాల్లో పంటపొలాలు నీట మునిగాయి. మంత్రి అచ్చెన్నాయుడు ముంపునకు గురైన పంటపొలాలను చూసి, నిర్వాసితులను పరామర్శించారు. మన్యం జిల్లా పాలకొండ మండలంలో వెయ్యి ఎకరాల వరకు పంట పొలాలు ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలో 5,381 ఎకరాల్లో వరి, మినుము, వేరుశనగ పంటలు ముంపునకు గురయ్యాయి. మురుగు కాలువలు కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో ముంపు పొలాల నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. విజయనగరం జిల్లాలో మడ్డువలస, తోటపల్లి రిజర్వాయర్లలోకి భారీగా వరద నీరు చేరడంతో పలు గ్రామాల్లో పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 13వేల ఎకరాలల్లో నీరు చేరింది.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ