23న డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక
ABN , Publish Date - Nov 05 , 2026 | 04:51 AM
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, 13 కార్పొరేషన్లలో ఈ నెల 23న డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక నిర్వహించనున్నారు.
అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, 13 కార్పొరేషన్లలో ఈ నెల 23న డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఈ ఎన్నికలకు ఈ నెల 18లోపు నోటీసు జారీ చేస్తామని ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికల్ని పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారు. ఆయా స్థానిక సంస్థలకు ఎన్నికైన వార్డు సభ్యులు, కార్పొరేటర్లు.. తమలో ఒకరిని వైస్ చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకుంటారు. ఎన్నికల నిబంధనలు, చట్టపరమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల అనివార్య కారణాల వల్ల 23న ఎన్నికలు నిర్వహించలేకపోతే.. 24న పూర్తి చేయాలని పునేఠా ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అధికారులు సహకరించాలని కోరారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్