Share News

జడ్పీ చైర్మన్‌ స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:25 AM

జడ్పీ చైర్మన్‌ స్థానాలపై కూటమి పార్టీల మధ్య ఆదివారం కూడా చర్చలు కొనసాగాయి. సీఎం నివాసంలో జరిగిన ఈ చర్చల్లో చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు లోకేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, జనసేన తరఫున ఎంపీ లింగమనేని రమేశ్‌ పాల్గొన్నారు.

జడ్పీ చైర్మన్‌ స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం

  • సీఎం చంద్రబాబుతో బీజేపీ, జనసేన నేతల చర్చలు

  • స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయానికి అంగీకారం

  • జనసేనకు ఆరు జడ్పీలు కేటాయించడానికి సిద్ధం

అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జడ్పీ చైర్మన్‌ స్థానాలపై కూటమి పార్టీల మధ్య ఆదివారం కూడా చర్చలు కొనసాగాయి. సీఎం నివాసంలో జరిగిన ఈ చర్చల్లో చంద్రబాబుతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు లోకేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, జనసేన తరఫున ఎంపీ లింగమనేని రమేశ్‌ పాల్గొన్నారు. 28 జడ్పీ స్థానాల్లో ఏ పార్టీకి, ఎన్ని స్థానాలనే విషయంపై సుదీర్ఘ చర్చలు జరిగినా ఓ నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో ముందు ఎన్నికలకు వెళ్లి, అనంతరం స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని మూడు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.

జడ్పీలకు పరోక్ష ఎన్నికలు జరుగుతుండటంతో స్థానిక నాయకత్వాలతో మాట్లాడి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. జనసేనకు ఆరు జడ్పీలనైనా కేటాయించాలనే ప్రతిపాదనకు దాదాపు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. బీజేపీకి జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో ఎక్కువ అవకాశం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా జడ్పీ, అనకాపల్లి జడ్పీ స్థానాలు జనసేనకు ఖరారయ్యాయి. వీటితోపాటు మరో నాలుగు స్థానాల్లో ఆ పార్టీకి అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 04:25 AM