Share News

YOGA: దినచర్యల్లో యోగా భాగం కావాలి : కలెక్టర్‌

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:43 PM

యోగావల్ల ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెంపొందుతాయని, యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్‌ ఆనంద్‌ సూచించారు. అంత ర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర - 2026లో భాగంగా గురువారం జిల్లా పర్యాటకశాఖ, ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం ప్రాంగ ణంలో టూరిజం డెస్టినేషన యోగా కార్యక్రమం నిర్వహించారు.

YOGA: దినచర్యల్లో యోగా భాగం కావాలి : కలెక్టర్‌
Collector Anand speaking.

తాడిపత్రి, జూన 18(ఆంధ్రజ్యోతి): యోగావల్ల ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెంపొందుతాయని, యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్‌ ఆనంద్‌ సూచించారు. అంత ర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర - 2026లో భాగంగా గురువారం జిల్లా పర్యాటకశాఖ, ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయం ప్రాంగ ణంలో టూరిజం డెస్టినేషన యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థు లు ప్రజలతో కలిసి యోగాసనాలు చేశారు. యోగామాస్టర్లు మురళీకృ ష్ణ, రవిప్రసాద్‌, గోవిందరెడ్డి, మమతా, రాజశేఖర్‌రెడ్డి, తిప్పయ్య పా ల్గొన్న వారితో ఆసనాలు వేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ జిల్లాలో యోగాపై అవగాహన పెంచేందుకు విస్తృత కార్య క్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఐడీవై ప్రచారంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పర్యాటక ప్రాంతాలపై అవ గాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా 50 టూరిజం డెస్టినేషన ప్రాంతాలను ఎంపిక చేశారని,


జిల్లాలో బుగ్గరామలింగేశ్వరస్వామి ఆల యం, గుత్తికోటను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 20న గుత్తికోటలో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు చైర్మన భూమా నాగరాగిణి, ఇనచార్జ్‌ ఆర్డీవో రామ్మోహన, హెచ ఎనఎనఎస్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కిరణ్మయి, జిల్లా టూరిజం అధికా రి ఓబులమ్మ, యోగాంధ్ర జిల్లా ఆయుష్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ లాల్య నాయక్‌, ఆయుష్‌ వైద్యాధికారి తిరుపతినాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌ శివరామకృష్ణ, తహసీల్దార్‌ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

గుంతకల్లుటౌన: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కసా పురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం ఈవో విజయరాజు పే ర్కొన్నారు. యోగాంధ్రలో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా శిక్షకులు వంశీకృష్ణ ఆల య సిబ్బందితో యోగాసనాలు చేయించారు. ఆలయ అఽధికారులు, వేద పండితులు, అర్చకులు, భక్తులు, గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రాయదుర్గం రూరల్‌: విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాభివృద్ధి కి యోగా అవసరమని కళాశాల ప్రిన్సిపాల్‌ సహదేవుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గురువారం డిగ్రీ కళాశా లలో యోగా అభ్యసన తరగతులు నిర్వహించారు. యోగా శిక్షకులు కెంచె మల్లికార్జున యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానంపై విద్యార్థు లకు నేర్పించారు. ఎనఎస్‌ఎస్‌ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 18 , 2026 | 11:43 PM