MLA: ప్రజలకు శాపాలుగా వైసీపీ పాపాలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:09 AM
వైసీపీ చేసిన పా పాలన్నీ ప్రజల పాలిట శాపాలుగా మారి, నిత్యం ఇబ్బందులకు గుర వుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. ఆ యన బుధవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజాదర్బార్ ని ర్వహించారు. నియోజవర్గంలోని వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో అర్జీలను స్వీకరించారు.
- ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
కళ్యాణదుర్గం, జూన 24(ఆంధ్రజ్యోతి): వైసీపీ చేసిన పా పాలన్నీ ప్రజల పాలిట శాపాలుగా మారి, నిత్యం ఇబ్బందులకు గుర వుతున్నారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విమర్శించారు. ఆ యన బుధవారం పట్టణంలోని ప్రజావేదిక వద్ద ప్రజాదర్బార్ ని ర్వహించారు. నియోజవర్గంలోని వివిధ గ్రామాల నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రజలతో అర్జీలను స్వీకరించారు. ఎక్కువ భాగం భూ వివాదాలు, రస్తా వివాదాలు, ట్రాన్సఫార్మర్లు, ఆక్రమణలు తదితర సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకి ప్రజలు తెలియజేశారు. ఆ అర్జీల ను స్వీకరించి ఆయా శాఖల అధికారులకు పంపి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అ నంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో తీసు కున్న అడ్డదిడ్డమైన నిర్ణయాలతో ప్రజలు నేడు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గంలో ఏ సమస్యనూ పరిష్కరించ కుండా, ఎక్కడికక్కడే నిర్లక్ష్యంగా వదిలేశారని వాపోయారు. ఇప్పుడు అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. మున్సి పాలిటీ అభి వృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. సంబంధిత శాఖల అధికా రుల సమన్వయంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు ప్రణాళిక లు రూపొందించి, ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....