Share News

YCP: వైసీపీ నాయకుల ఆగడాలు

ABN , Publish Date - Mar 09 , 2026 | 11:18 PM

మండలకేంద్రంలో వైసీపీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్ర జలను ఇబ్బంది పెడు తున్నట్లు విమర్శలు వ్య క్తం అవుతున్నాయి. మండల కేంద్రంలోని శు భోదయ ఇంగ్లీష్‌ మీడి యం పాఠశాల ఎదుట వైసీపీ నాయకులు డాబా ను ఏర్పాటు చేశారు. ఈ డాబాకు విద్యుత సౌక ర్యం కోసం కరకముక్కల గ్రామం నుంచి జీబీసీ కాలువ వరకూ ఉన్న ఏన్నో ఏళ్ల నాటి పచ్చని చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి వేశారు.

YCP: వైసీపీ నాయకుల ఆగడాలు
A scene of felling of a tree by the side of the national highway

- ఇబ్బందులు పడుతున్న ప్రజలు

- చర్యలు తీసుకోవాలంటున్న టీడీపీ నాయకులు

విడపనకల్లు, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో వైసీపీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్ర జలను ఇబ్బంది పెడు తున్నట్లు విమర్శలు వ్య క్తం అవుతున్నాయి. మండల కేంద్రంలోని శు భోదయ ఇంగ్లీష్‌ మీడి యం పాఠశాల ఎదుట వైసీపీ నాయకులు డాబా ను ఏర్పాటు చేశారు. ఈ డాబాకు విద్యుత సౌక ర్యం కోసం కరకముక్కల గ్రామం నుంచి జీబీసీ కాలువ వరకూ ఉన్న ఏన్నో ఏళ్ల నాటి పచ్చని చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికి వేశారు. కరకముక్కల రోడ్డు పక్కన ఉన్న పచ్చని చెట్టు కింద సమీప గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఆటోల కోసం కూర్చుని ఎదురు చూసే వారు. అటువంటి చెట్టును నరికి వేసి నిలువ నీడ లేకుండా చేశారు. ఆ చెట్టు మొద్దులను కూడా ఎవరికీ తెలియ కుండా వైసీపీ నాయకులు మాయం చేశారు. అదేవిధంగా డాబాకు నీటి సౌకర్యం కోసం జనార్దనపల్లికి వెళ్లే ప్రధాన పైప్‌లైనకు దౌర్జన్యంగా కొళాయి కనెక్షన తీసుకున్నారు. సామాన్య ప్రజలు విద్యుత కనెక్షన్ల కోసం దరాఖాస్తులు చేస్తే ఏళ్ల తరబడి అయినా కనెక్షన్లు ఇవ్వరు. అదే వైసీపీ నాయకులు


ధరఖాస్తు చేసుకున్న నెల రోజులకే విద్యుత కనెక్షన వచ్చింది. ఈ క్రమంలో విద్యుత స్తంభాలు ఏర్పాటు చేస్తున్న సమయంలో మాళాపురం, జనార్ద నపల్లి, చాబాల, వేల్పుమడుగు గ్రామాలకు వెళ్లే ప్రధాన తాగునీటి పైప్‌లైన్లను పగలగొట్టి వెళ్లారు. దీంతో మూడు రోజులుగా ఆ గ్రామాలకు తాగు నీరు లేకుండా పోయింది. దీంతో ఆ గ్రామాల ప్రజలు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం విద్యుత కాం ట్రాక్టర్‌ పైప్‌లైన మరమ్మతులు కూడా చేయించకుండా వదిలేశారు ఆ తరువాత ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది మరమ్మతుల పనులు చేపట్టారు. పచ్చని చెట్లను నరికి వాటి మొద్దులను కూడా విక్రయించారు. ఈ మేరకు వైసీపీ నాయకుల ఆగడాలనై టీడీపీ స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వైసీపీ నాయకుల ఈ దౌర్జన్యకర సంఘటనలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 09 , 2026 | 11:18 PM