Share News

MLA: రాజకీయాల్లో వైసీపీ ఓ విషనాగు

ABN , Publish Date - Jun 15 , 2026 | 11:47 PM

రా జకీయాల్లో వైసీపీ ఓ విషనాగు లాంటి పార్టీ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు ద్వజమోత్తారు. రాష్ట్రంలో కూటమి పాలనకు రెండేళ్లు నిండిన సందర్భంగా డి. హీరేహాళ్‌ మం డలం కల్యం గ్రామంలో సోమవారం సాయంత్రం బహిరంగ సభ నిర్వ హించారు.

MLA: రాజకీయాల్లో వైసీపీ ఓ విషనాగు
MLA Kalava speaking; Alliance leaders seated on the dais.

- వైసీపీ విధ్వంసం.. కూటమి వికాసం

- రెండేళ్ల పాలనలో ప్రగతి పథంలో రాయదుర్గం

- 1267. 44 కోట్లతో అభివృద్ధి : ప్రభుత్వ విప్‌ కాలవ

డి. హీరేహాళ్‌ (బొమ్మనహాళ్‌), జూన 15(ఆంధ్రజ్యోతి): రా జకీయాల్లో వైసీపీ ఓ విషనాగు లాంటి పార్టీ అని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు ద్వజమోత్తారు. రాష్ట్రంలో కూటమి పాలనకు రెండేళ్లు నిండిన సందర్భంగా డి. హీరేహాళ్‌ మం డలం కల్యం గ్రామంలో సోమవారం సాయంత్రం బహిరంగ సభ నిర్వ హించారు. ఈ సభకు కాలవ శ్రీనివాసులుతో పాటు బీజేపీ నియోజకవ ర్గ ఇనచార్జ్‌ జింకా వసంధర, జనసేన ఇనచార్జ్‌ మంజునాథ హాజర య్యారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమంపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ కాలవ మాట్లా డుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూట మి ప్రభుత్వ సహకారం, యువనేత నారా లోకేష్‌ తోడ్పాడుతో నియో జకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ గత రెండేళ్లలో నిమోజకవర్గానికి రూ. 1267.44 కోట్ల నిధులు మంజూరు చేయించామని పేర్కొన్నారు.


ఇందులో అభివృద్ధి పనులకు రూ. 1025.22 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకు రూ. 240. 22 కోట్లు కేటాయించినట్లు వె ల్లడించారు. ఐదేళ్లుగా నిలిచిపోయిన అభివృద్ధి పనులకు మళ్లీ వేగం పెం చి, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృ షి చేస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం అభివృద్ధి నిరంతరం కొన సాగుతుందన్నారు. గత ఐదేళ్ల జగన అరాచక పాలనలో చిన్నాభిన్నమైన వ్యవస్థలను రెండేళ్లలో గాడిలో పెట్టిన దార్శనికుడు సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల హామీల్లో 90 శాతం నెరవేర్చడంతో పాటు పారిశ్రా మిక పెట్టుబడులకు రాషా్ట్రన్ని స్వర్గధామంగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలను జీర్ణించుకోలేని జగనరెడ్డి అనునిత్యం ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నార న్నారు. అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీని నిర్వహిస్తే దానిపైనా సత్యదూరమైన ఆరోపణలకు జగన అండ్‌ కో తెగబడుతోందని విమర్శిం చారు. ఇలాంటి విషపార్టీకి రాష్ట్రంలో ఎక్కడా తావు లేకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అమృత -2, జల్‌జీవన మిషన కింద ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తా మన్నారు. అనంతరం కల్యం గ్రామంలో రీ సర్వే జరిగిన భూములకు సంబంధించి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన రాష్ట్ర డైరక్టర్‌ నాగళ్లి రాజు, రాయదుర్గం మార్కెట్‌ యార్డు చైర్మన హనుమంతరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్‌ కదూలూరు మోహనరెడ్డి, కల్లస్టర్‌ కన్వీనర్‌ గంగధర, టీడీపీ నాయకులు కల్యం తిప్పేస్వామి, మొండి మల్లికార్జున, దొడఘట్ట రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 15 , 2026 | 11:47 PM