Share News

ROADS: అధ్వానంగా రహదారులు

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:03 AM

దశాబ్దాలుగా అభివృధ్దికి నోచుకోని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నేతలు మారినా తమ తరలరాతలు మారడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామాలకు సరైన రోడ్లు లేక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లోకి కనీసం అత్యవసర వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది.

ROADS: అధ్వానంగా రహదారులు
Ratnalapally road with gravel

- దశాబ్దాలు గడిచినా మారని గ్రామాల దశ

- అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అంతే సంగతులు

నల్లచెరువు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా అభివృధ్దికి నోచుకోని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నేతలు మారినా తమ తరలరాతలు మారడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామాలకు సరైన రోడ్లు లేక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లోకి కనీసం అత్యవసర వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది. అందులో పాయలవాండ్లపల్లి, తలమర్లవాండ్లపల్లి, గుర్రం వాండ్లపల్లి, మద్దేపల్లి, కమ్మవారిపల్లి, ఉబిచెర్ల, రాట్నాలపల్లి, తవళం మర్రి, పంతులచెరువు, రమణప్పగారిపల్లి ఎస్సీ కాలనీ ఇప్పటికీ సరైన రోడ్లు లేవు. వాటిలో కొన్నిగ్రామాల రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.


ఇప్పటికీ సరైన రోడ్లు లేవు. ఏదైనా అత్యవసరం అయితే 108 వాహనం కూడా ఆ గ్రామాల్లోకి వెళ్లలేదు. ఇకపోతే వర్షాకాలంలో చిన్న వాన కురిసినా పాయలవాండ్లపల్లి, గుర్రంవాండ్లపల్లి, కమ్మవారిపల్లి రోడ్లు బురదమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడు తోంది. అత్యవసర పరిస్థితుల్లో అతి కష్టం మీద ఆసుపత్రులకు చేరుకోవాల్సి వస్తోంది. కొన్ని సందర్భాలలో మధ్యలోనే ప్రసవాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ప్రతిపాదనలను పంపుతాం- రవీంద్రనాయక్‌, ఏఈ( ఇనచార్జ్‌), నల్లచెరువు

మండలంలో పరిశీలించి రోడ్డులేని గ్రామాలను త్వరలో గుర్తిస్తాం. వాటి రోడ్డు సౌకర్యం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతిపాదనలు పంపుతాం. అన్ని గ్రామాలకు రోడ్డు వసతి కల్పిస్తాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jan 25 , 2026 | 12:03 AM