Share News

PROTEST: పెట్రో ధరల పెంపుపై ఆందోళన

ABN , Publish Date - May 18 , 2026 | 11:56 PM

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్దకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

PROTEST: పెట్రో ధరల పెంపుపై ఆందోళన
CPI leaders protesting at a petrol station in Gutti

గుత్తి /తాడిపత్రి, మే18(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పట్టణంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్దకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ మండల కార్యదర్శి రామదాస్‌, సీపీఐ పట్టణ కార్యదర్శి రాజు, నాయకులు రమేష్‌, వెంకటరాముడు, మహమ్మదా, నజీర్‌, మల్లికార్జున, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాడిపత్రిలో సీపీఐ నాయకులు పుట్లూరురోడ్డు సర్కిల్‌ వద్ద ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నా యకులు రంగయ్య, చిరంజీవి యాదవ్‌, శ్రీరాములు, నాగరంగయ్య, ర త్నమయ్య, రమణ, శీన,రంగస్వామి, అబ్రహం, నాయక్‌, నారాయణరెడ్డి, వీరనారాయణ, బాబయ్య, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

రాయదుర్గం రూరల్‌: పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం పాత మున్సిపల్‌ కార్యాలయం వ ద్ద అరగంట పాటు నిరసన తెలిపారు.


సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన అధ్యక్షులు కార్యదర్శిలు నాగరాజు, రాము, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

గుంతకల్లుటౌన/ ఉరవకొండ: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని వైసీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. వైసీపీ స్ధానిక కార్యాలయం నుంచి సోమవారం పొట్టి శ్రీరా ములు విగ్రహం వరకు ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, నాయకులు జింకల రామాంజి నేయులు, గోవిందు నాయక్‌, చిన బాబు, ఖలీల్‌, అబ్దుల్‌ బాసిద్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో తాడుతో ట్రాక్టర్‌ లాగి నిరసన తెలిపారు. తహసీల్దారు కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఏసీ ఎర్రిస్వామి, గోవిందు, అశోక్‌, మూలగిరి పల్లి ఓబన్న పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 18 , 2026 | 11:56 PM