Share News

SP: పోలీసుల సంక్షేమానికి కృషి : ఎస్పీ

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:52 PM

పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తు న్నామని ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పాత పోలీస్‌ క్వార్టర్స్‌ మైదానంలో సోమవారం పోలీస్‌ వెల్ఫేర్‌ విభాగం ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు నిర్మాణానికి ఎస్పీ జగదీష్‌ సోమవారం భూమిపూజ చేశారు.

SP: పోలీసుల సంక్షేమానికి కృషి : ఎస్పీ
SP Jagadish doing Bhumi Puja

గుత్తి, జూన 8(ఆంధ్రజ్యోతి): పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తు న్నామని ఎస్పీ జగదీష్‌ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పాత పోలీస్‌ క్వార్టర్స్‌ మైదానంలో సోమవారం పోలీస్‌ వెల్ఫేర్‌ విభాగం ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకు నిర్మాణానికి ఎస్పీ జగదీష్‌ సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జిల్లాలోని పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని భా రత పెట్రోలియం కార్పొరేషన లిమిటెడ్‌ సమన్వయంతో రూ. 95లక్షల అంచనా వ్యయంతో నూతన పెట్రోల్‌ బంకును ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. నాణ్యమైన ఇంధనాన్ని ప్రజలకు అందించడమే ప్రధా న లక్ష్యం అన్నారు. అడిషనల్‌ ఎస్పీ ఇలియాజ్‌ బాష, డీఎస్పీ శ్రీని వాస్‌, ఏఆర్‌ డీఎస్పీ నీలకంఠేశ్వర రెడ్డి, బీపీసీఎల్‌ మేనేజర్‌ లక్ష్మి, సీఐ రామారావు, ఎస్‌ఐలు సురేష్‌, అమీర్‌ఖాన తదితరలు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jun 08 , 2026 | 11:52 PM