Share News

MLA: బలహీన వర్గాల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - May 29 , 2026 | 12:20 AM

బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రా మారావు ఆశయ సాధన కోసం పని చేద్దామని టీడిపి జోనల్‌ కో- ఆర్డినే టర్‌ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా అద్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంఅన్నారు.

MLA: బలహీన వర్గాల సంక్షేమానికి కృషి
MLA Gummanur speaking in Thondapadu of Gutti mandal

- ఎమ్మెల్యే గుమ్మనూరు

గుత్తిరూరల్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రా మారావు ఆశయ సాధన కోసం పని చేద్దామని టీడిపి జోనల్‌ కో- ఆర్డినే టర్‌ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా అద్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంఅన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పండుగ మహనాడు వేడుకను గుత్తి మండలం తొండపాడు గ్రామంలో రెండో రోజూ ఘనంగా నిర్వహించారు. ఎన్టీ రామరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా గుంతకల్లు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ క్యాంపు కార్యాలయంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి నంద మూరి తారకరామారావు 103వ జయంతిని గురువారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్ర గౌడ్‌ ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎల్‌ఈడీ స్ర్కీన ద్వారా మహానాడు కార్యక్రమాన్ని వీక్షించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - May 29 , 2026 | 12:20 AM