WOMEN: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Mar 08 , 2026 | 12:03 AM
ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వక్త లు పేర్కొన్నారు. పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో శనివారం అం తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
(ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్)
ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వక్త లు పేర్కొన్నారు. పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో శనివారం అం తర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుంతకల్లు శ్రీ శంకరానందగిరిస్వామి డిగ్రీ కళాశాలలో కరస్పాండెంట్ కేసీ హరి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ గైనకాలజిస్ట్ సరోజమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్ని ప్రసంగించారు. విద్యార్థులకు పలు పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను అంద జేశారు. వైద్యురాలు, మహిళా ఆధ్యాపకులను కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. గుత్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీఓ ఎల్ల మ్మ అధ్యక్షతన నిర్వ హించిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన వ న్నూర్‌బీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఉరవకొండ మండలం లోని రేణుమాకుల పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యుడు సాకే భాస్కర్ ఆధ్వర్యంలో పాఠశాలలో పని చేస్తున్న మహిళ ఉపాధ్యాయులను, అంగనవాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను సన్మానించారు. కూడేరు ఎమ్మార్సీ కార్యాయలంలో పని చేస్తున్న మహిళలను ఎంఈవో గౌస్‌మొద్దీన. హెచఎంలు రవీంద్ర, ఓబులుపతి, రాంభూపాల్‌రెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు. రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ శ్రీనివాసులు అ ధ్యక్షతన మహిళా దినోత్స వాన్ని నిర్వహించారు. కుందు ర్పి మండల పరిధిలోని మా యదార్లపల్లి ప్రాథమి కోన్నత పాఠశాలలో మహిళా ఉపా ధ్యాయులను సన్మానించారు.