MLA: మహిళలు మహా శక్తిగా ఎదగాలి
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:46 PM
గ్రామాల్లో మహిళ కార్యకర్తలు మహా శక్తి లాగా ఎదగాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించా రు. మండలంలోని బుచ్చక్క కట్ట వద్ద బుధవారం టీడీపీ మహిళా కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ఎమ్మె ల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి హాజర య్యారు.
ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ
యల్లనూరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో మహిళ కార్యకర్తలు మహా శక్తి లాగా ఎదగాలని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సూచించా రు. మండలంలోని బుచ్చక్క కట్ట వద్ద బుధవారం టీడీపీ మహిళా కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ఎమ్మె ల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి హాజర య్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని, అందుకు అనుకూలంగా గ్రామాల్లో మహి ళలు రాజకీయంగా ఎదగాలన్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కుటుం బాన్ని అభివృద్ధి చేయడానికి ఆ ఇంటి ఇల్లాలు ఎంత తోడ్పాటు అందిస్తుందో అదే విధంగా గ్రామ అభివృద్ధి కూడా మహిళలు చేయూత ఇవ్వాలని పేర్కొన్నారు. అప్పుడే ఆ గ్రామంతో పాటు మండలం అభివృద్ధి చెందుతుందన్నారు. అనం తరం డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మహిళా కార్యకర్తల సమక్షంలో కేక్‌కట్ చేశారు.