Share News

SS TANK: తుంగభద్రతో ఎస్‌ఎస్‌ ట్యాంకుకు జలకళ

ABN , Publish Date - Sep 21 , 2026 | 12:04 AM

మండల పరిధిలోని నింబగల్లు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు తుంగభద్ర జలాలతో నిండిపోయింది. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కాలువ లకు తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వదిలారు. అయితే మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆర్‌డబ్య్లూఎస్‌ అధికారులను అప్రమత్తం చేయడంతో వారు ప్రత్యేక ప్రణాళికతో 35రోజుల్లోనే రెండు చెరువులను నింపారు.

SS TANK: తుంగభద్రతో ఎస్‌ఎస్‌ ట్యాంకుకు జలకళ
Full SS tank

ఉరవకొండ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని నింబగల్లు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు తుంగభద్ర జలాలతో నిండిపోయింది. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కాలువ లకు తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వదిలారు. అయితే మంత్రి పయ్యావుల కేశవ్‌ ఆర్‌డబ్య్లూఎస్‌ అధికారులను అప్రమత్తం చేయడంతో వారు ప్రత్యేక ప్రణాళికతో 35రోజుల్లోనే రెండు చెరువులను నింపారు. తుంగభద్ర కాలువల నుంచి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులోకి నిటిని నింపేందుకు ప్రత్యేక మోటార్లను ఏర్పాటు చేశారు. నీటిని నింపే బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అందుకోసం 24గంటలూ నీటి పంపింగ్‌ జరిగేలా ప్రత్యేకంగా ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేయించి, హెచ్చెల్సీపై 150హెచపీ సామర్థ్యం కలిగిన మూడు మోటార్లను ఏర్పాటు చేయించారు. మూడు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల సామర్థ్యం ఒక టీఎంసీ కాగా, ఇప్పటికే అధికారులు ఆరు మీటర్ల పొడవున్న బండల ట్యాంకును, 15అడుగుల ట్యాంకును నింపారు. మరో నాలుగు రోజుల్లో మూడు మీటర్ల ట్యాంకును నింపుతామని ఆర్‌డబ్య్లూఎస్‌ డీఈ సఫ్రీన తెలిపారు. మంత్రి ఆదేశాలతో ప్రత్యేక ప్రణాళిక ద్వారా నీటి పంపింగ్‌ చేపట్టామని డీఈ తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 21 , 2026 | 12:04 AM