WILDLIFE: జనావాసాల్లోకి వన్యప్రాణులు
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:34 PM
ఇటీవలి కాలం లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. వన్యప్రాణులకు అడవులలో అవస రమైన ఆహారం, వసతి, తాగునీరు దొరకకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులలో అవి జనావాసాల్లోకి తరచూ ప్రవేశిస్తున్నాయి. రాయదు ర్గం ఒకపుడు దట్టమైన అడవులు, కొండ గుట్టలతో కూడి ఉండేది.
- అటవీ ప్రాంతంలో నీరు, ఆహారం కొరత
- చెట్లు, గుండ్ల తొలగింపుతో తగ్గిపోతున్న ఆవాసాలు
రాయదుర్గం రూరల్, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఇటీవలి కాలం లో వన్యప్రాణులకు రక్షణ కరువైంది. వన్యప్రాణులకు అడవులలో అవస రమైన ఆహారం, వసతి, తాగునీరు దొరకకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితులలో అవి జనావాసాల్లోకి తరచూ ప్రవేశిస్తున్నాయి. రాయదు ర్గం ఒకపుడు దట్టమైన అడవులు, కొండ గుట్టలతో కూడి ఉండేది. అడవుల్లోని చెట్లను కొట్టివేయడం, పెద్దపెద్ద గుండ్లను ప్రజల అవసరాల కోసం పగులగొట్టడంతో వన్యప్రాణులకు సహజమైన ఆవాసాలు కరువ య్యాయి. దీంతో అవి తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. రాయదు ర్గం ఎల్లమ్మకొండపై ఉన్న చెట్లకు తరచూ కొందరు నిప్పు పెట్టడం వల్ల అవి కాలిపోయి ఉన్న కాస్త అడవి కనుమరు గయ్యే పరిస్థితి నెలకొంది. రాయదుర్గం పరిసరాలలోని బొందన కల్, ధర్మపురి అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, నెమళ్లు, కోతులు, కణేకల్లు ప్రాంతంలో జింకలు అధికంగా ఉన్నాయి. వీటికి అవసరమైన ఆహారం, నీరు అడవిలో లభించడంలేదు. ఎల్లమ్మకొండపై కొంతకాలం క్రితం చిరు త తాగునీటి కోసం అక్కడి ఏనుగుల బావిలో దిగి బురదనీటిలో చిక్కుకొని మృతి చెందింది.
ఇటీవల ఓ ఎలుగు బంటి ఆహారం కోసం తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల మైదానంలో ప్రవేశించి అటవీ శాఖ వలలో చిక్కుకుంది. అదేవిధంగా సుమారు మూడేళ్ల వయస్సున్న జింక కళేబరం రిక్రియేషన క్లబ్ ఆవరణలో స్థానికులకు కనిపించింది. చిరుత పులి దాడిలో గాయపడిన ఆ జింక క్లబ్ ఆవరణలో మృతి చెందిందని పశువైద్యులు నిర్ధారించారు. కోతిగుట్ట పరిస చిరుత దాడి చేసి ఉంటుం దని స్థానికులు అంటున్నారు. పైతోట జాతీయ రహదారి, బళ్లారిరోడ్డు, మల్లాపురం - కణేకల్లు రోడ్డు, వీరాపురం తదితర ప్రాంతాల్లో ఎలు గుబంట్లు ఆ మార్గంలో వెళ్లు వాహనచోదకులకు తరచూ కనిపిస్తాయి. చిరుతలు కూడా మారెమ్మగుడి, పైతోట, శిరిగేదొడ్డి, అడిగుప్ప తదితర ప్రాంతాల్లో స్థానికులకు కనిపిస్తుంటాయి. ఇక కోతులు ఆహారం లభించ క రాయదుర్గం పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిష్టవేశాయి. అటవీ ప్రాంతంలో జంతువులకు అవసరమైన పళ్లచెట్లు, ఇతర ఆహారం, తాగు నీరు లభించే వాతావరణాన్ని అటవీశాఖ కల్పిస్తే వన్యప్రాణులను జన నివాసాల్లోకి రాకుండా నివారించవచ్చని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....