PIPE: మరమ్మతులు ఎన్నడో?
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:05 AM
మండల పరిధిలోని నింబగల్లు సమీపంలో తాగునీటి పైప్‌లైన పగిలిపోయి పది రోజులైనా అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఉరవకొండలో తాగు నీటి సరఫరా ఆగిపోయింది. పైప్‌లైన పగిలిపోయి పది రోజులైనా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు.
- పదిరోజుల క్రితం పగిలిపోయిన పైప్‌లైన
ఉరవకొండ, జూన 16(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని నింబగల్లు సమీపంలో తాగునీటి పైప్‌లైన పగిలిపోయి పది రోజులైనా అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. దీంతో ఉరవకొండలో తాగు నీటి సరఫరా ఆగిపోయింది. పైప్‌లైన పగిలిపోయి పది రోజులైనా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. మరమ్మతుల కోసం గుంతలు తవ్వి పది రోజులుగా అలాగే వదిలేశారు. నింబగల్లు చెరువు నుంచి ఉరవకొండతో పాటు ఏడు గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. రెండ్రోజులుగా పీఏబీఆర్ డ్యాం నుంచి ఉరవకొండకు నీటి సరఫరా నిలిచిపోయింది. ఇలాంటి సమయంలో పైప్‌లైనకు మరమ్మతులు చేసి ఉంటే నింబగల్లు చెరువు నుంచి ఉరవకొండకు తాగు నీటిని పంపింగ్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పటికే ఉరవకొండలో ఐదు రోజులకు ఒక్కసారి నీరు వదులుతున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైనకు మరమ్మతులు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....