Share News

VIP: సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం

ABN , Publish Date - Mar 18 , 2026 | 11:16 PM

తెలుగుదేశం పార్టీ మూల సూత్రాల్లో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర యాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాటుచేసిన దివ్యాంగ శక్తి పథకా న్ని బుధవారం ఆయన పట్టణంలో ప్రారంభించారు.

VIP: సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం
MLA Kalava launching the Divyang Shakti scheme in Rayadurgam

- ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం, మార్చి 18(ఆంధ్ర జ్యోతి): తెలుగుదేశం పార్టీ మూల సూత్రాల్లో సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర యాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాటుచేసిన దివ్యాంగ శక్తి పథకా న్ని బుధవారం ఆయన పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ శ్రేయోరాజ్యాన్ని స్థాపించాలని టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు సంకల్పించారన్నారు. ఆయన అడుగు జాడల్లో కూటమి ప్రభుత్వం పయనిస్తోందన్నారు. దివ్యాంగశక్తి పథకం అమలుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశా రు. లబ్ధిదారులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే అనంతరం బళ్లారిరోడ్డులోని సీతారామాంజనేయ కల్యాణమండపంలో సహపంక్తి భోజనం చేశారు.


టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణమూర్తి, బీజేపీ నా యకులు అంబోజీరావు, వసుంధరదేవి, కురుబ కార్పొరేషన డైరెక్టర్‌ కరే గౌడ మంజునాథ, నాయకులు టంకశాల హనుమంతు, పూజారి శివ, జిలాన, క రెన్న, అగ్రహారం కిరణ్‌, గుద్దిటి లోకేష్‌, ఆనంద్‌, బూదూరు తిప్పేస్వామి, వై వెంకటేశులు, ఆటో వెంకటేశులు పాల్గొన్నారు.

గుంతకల్లు: దివ్యాంగ శక్తి పథకాన్ని టీడీపీ నాయకుడు గుమ్మనూ రు నారాయణ స్వామి బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండులో ప్రారం భించారు. ఆర్డీవో శ్రీనివాసులు, ఆర్టీసీ డీఎం ఖాజా వలి, టీడీపీ నాయ కులు బీఎస్‌ కృష్ణారెడ్డి, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, తలారి మస్తానప్ప, పాల మల్లికార్జున, హనుమంతు, రామన్న చౌదరి, ఫజులు, ప్రభాకర్‌, గుజరీ ఖాజా, ఫ్రూట్‌ మస్తాన, ఆటో ఖాజా తదితరులు పాల్గొన్నారు.

ఉరవకొండ: ఏఎంసీ చైర్మన విజయ్‌భాస్కర్‌, పీఏసీ చైర్మన కేశవానంద, పెన్నహోబిలం ఆలయకమిటీ చైర్మన రేగాటి నాగరాజు బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలో దివ్యాంగ శక్తి ఉచిత బస్సును ప్రత్యేకాధికారి పద్మావతితో కలిసి వారు ప్రారంభిం చారు. డిపో మేనేజరు హంపన్న, టీడీపీ నాయకులు రామాంజినేయు లు, తిమ్మప్ప, గోవిందు, వరప్రసాద్‌, నెట్టెంబోస్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

తాడిపత్రి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో డిపో మేనేజర్‌ మురళీధర్‌ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన దివ్యాంగశక్తి పథకాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ శివ రామ కృష్ణ ముఖ్య అతిథి గా హాజరై ప్రారంభిం చారు. న్యాయవాది వెంకటే శ్వర్లు, ఆర్టీసీ ఎస్‌టీఐ షాషా వలి, సిబ్బంది పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Mar 18 , 2026 | 11:16 PM